ఇంట్లో నెయ్యిని చాలా ఈజీగా ఎలా తయారుచేయాలి?
నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంది నెయ్యిని ఆవకాయతో పాటుగా రకరకాల ఫుడ్స్ తో తింటుంటారు. చాలా మంది మార్కెట్ లో కొన్న నెయ్యినే వాడుతారు. కానీ మీరు ఇంట్లో కూడా చాలా ఈజీగా నెయ్యిని తయారుచేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నెయ్యిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని రోజూ ఒక టీ స్పూన్ తింటే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. అందుకే మన దేశంలో నెయ్యని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. నిజానికి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది ఇంతకు మించి మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వెన్నే నెయ్యిగా మారుతుంది. ఇది లాక్టోస్, కేసైన్ లేనిది. లాక్టోస్ అసహనం లేదా పాల అలెర్జీ ఉన్నవారు నెయ్యిని తినకపోవడమే మేలు. నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో శారీరక విధులకు అవసరపడతాయి. అయితే చాలా మంది షాప్ లో కొన్ని నెయ్యినే వాడుతుంటారు. దీన్ని తయారుచేయడం చాలా కష్టమని అనుకుంటారు. కానీ ఇంట్లోనే చాలా ఫాస్ట్ గా, ఈజీగా నెయ్యిని తయారుచేయొచ్చు. అదెలాగో ఇప్పడు తెలుసుకుందాం పదండి.
ఒక మందపాటి కడాయిని తీసుకోండి. మీరు పక్కన పెట్టుకున్న వెన్నలో సాల్ట్ అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఉప్పు నెయ్యి రుచిని మారుస్తుంది. తర్వాత మండపాటి కడాయిని మీడియం హీట్ మీద వేడి చేసి వెన్న పూర్తిగా కరిగిపోయేలా చేయండి. ఇది కరిగిన తర్వాత వెన్న చాలా వేగంగా ఉడకకుండా స్టవ్ ను సిమ్ లో పెట్టండి. దీనివల్ల వెన్నలో ఉన్ననీటి కంటెంట్ నెమ్మదిగా ఆవిరై పోతుంది.
వెన్నను ఉడకబెడుతుంటే దానిపై నురగ ఏర్పడుతుంది. ఈ నురుగును చెంచాతో నెమ్మదిగా తీసేస్తూ ఉండండి. వెన్నను అలాగే కడాయికి నెయ్యి అంటుకోకుండా ఉండటానికి అప్పుడప్పుడు కలపండి.
వెన్నను ఉడకబెట్టేటప్పుడు పాల ఘనపదార్థాలు కడాయి అడుగు భాగానికి చేరి బంగారు గోధుమ రంగులోకి మారినప్పుడు నెయ్యి తయారయ్యిందని అర్థం చేసుకోండి. ముఖ్యంగా వెన్న మండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కనిపెట్టుకుని ఉండండి.
నెయ్యి చల్లారిన తర్వాత కడాయి నుంచి బయటకు తీసి శుభ్రమైన గిన్నెపై సన్నని మెష్ స్ట్రెయినర్ లేదా చీజ్ క్లాత్ పై ఉంచండి. మిగిలిన పాల ఘనపదార్థాలను తొలగించడానికి వేడి నెయ్యిని స్ట్రెయినర్ ద్వారా జాగ్రత్తగా పోయాలి.హోం మేడ్ నెయ్యి రెడీ అయినట్టే. దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరిచి కంటైనర్ లో నిల్వ చేయండి.