జుట్టు ఊడిపోకూడదంటే వారానికి ఎన్ని సార్లు నూనె పెట్టాలో తెలుసా?
చాలా మంది జుట్టుకు నూనెను పెట్టరు. ముఖ్యంగా ఆఫీసులకు, కాలేజీకి వెళ్లేవారు. కానీ జుట్టు ఊడిపోకుండా.. బాగా పెరగాలన్నా, పొడుగ్గా పెరగాలన్నా ప్రతి వారం జుట్టుకు నూనె పెట్టాలి.
ప్రతి ఒక్క మహిళకు జుట్టంటే చాలా ఇష్టం. ఒత్తైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ జుట్ట అందరికీ ఒకేలా ఉండదు. కారణం జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం. అయితే కొంతమందికి జెనెటిక్స్ గా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. ఇకపోతే చాలా మందికి జుట్టును సరిగ్గా చూసుకోవడం వల్లే జుట్టు పెరగదు. సన్నగా అవుతుంది. సరైన జీవనశైలి, ఆహారం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం జుట్టు పొడిబారడం, రాలడం, చుండ్రుతో పాటుగా ఎన్నో జుట్టు సమస్యలు వస్తాయి.
ప్రస్తుత కాలంలో చాలా మందికి జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారింది. కానీ హెల్తీ హెయిర్ మెయింటెయిన్ చేయడంలో స్కాల్ప్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. నూనె జుట్టుకు తగిన పోషణను అందించడమే కాకుండా జుట్టు కుదుళ్లలోకి లోతుగా చొచ్చుకుపోయి జుట్టు మూలాలను బలంగా చేస్తుంది. అలాగే ఇది నెత్తికి మంచి పోషణను అందించి జుట్టు పెరిగేలా చేస్తుంది. అందుకే జుట్టుకు వారానికి ఎన్ని రోజులు నూనె రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టు రకాన్ని బట్టి: మీ జుట్టు డ్రైగా ఉంటే వారానికి 2 నుంచి 3 సార్లు నూనె రాసుకోవచ్చు. ఒకవేళ మీ జుట్టు జిడ్డుగా ఉంటే గనుక వారానికి ఒకసారి మాత్రమే నూనె పెట్టాలి. మీకు ఈ రెండూ లేకుండా సాధారణ జుట్టు ఉంటే వారానికి 1 లేదా 2 సార్లు నూనె పెట్టొచ్చు.
జుట్టు సమస్య ఉంటే: మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉన్నట్టైతే వారానికి 2 లేదా 3 సార్లు నూనె రాయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోకుండా ఉంటుంది. అలాగే మీకు చుండ్రు సమస్య ఉన్నట్టైతే వారానికి 2 లేదా 3 సార్లు నూనెను రాసుకోవచ్చు.
వాతావరణాన్ని బట్టి: మీకు విపరీతంగా చెమట పట్టినట్టైతే మీరు వారానికి 2 లేదా 3 సార్లు జుట్టుకు నూనె పెట్టాలి. అలాగే విపరీతమైన వేడి, చల్లని వాతావరణంలో.. వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే జుట్టుకు నూనె పెడితే సరిపోతుంది.
జుట్టుకు నూనె ఎలా పెట్టాలంటే?
మీ జుట్టుకు సరిపోయే మంచి నూనెను మాత్రమే జుట్టుకు పెట్టాలి. అలాగే నూనెను తలకు పట్టించే ముందు కొద్దిగా వేడి చేయాలి. జుట్టుకు నూనె పెట్టిన తర్వాత వేళ్లతో నెత్తిని మసాజ్ చేయాలి. ముఖ్యంగా జుట్టుకు నూనె రాసుకున్న తర్వాత సుమారు గంటసేపు నాననివ్వాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే జుట్టుకు తేలికపాటి షాంపూనే ఉపయోగించాలి.
తలకు నూనె రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు: జుట్టుకు నూనె రాసుకున్నప్పుడు దానిలో ఉండే పోషకాలు హెయిర్ షాఫ్ట్, స్కాల్ప్ కు వెళ్లి జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే నూనె జుట్టులో తేమను నిలుపుతుంది . పొడి బారడాన్ని, జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. నూనె పెట్టి తలను మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు తగిన పోషకాహారం, ఆక్సిజన్ అందేలా చేస్తుంది.
- Foods that cause hair loss
- Hair Oiling Benefits
- Haircare Mistakes To Avoid
- How Many Times Should You Oil Your Hair
- How to keep hair healthy
- Reasons for hair fall
- Things to Avoid if You Have Hair Loss
- What protects hair from damage
- benefits of hair oiling
- hair care
- hair care habits that can damage your hair
- hair care tips in telugu
- hair fall
- hair oiling
- hair oiling tips
- hair type
- how often we should oil your hair
- oil your hair
- which is the best oil for hair care