Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాషన్ టిప్స్... దీపావళి వేళ ఎలాంటి దుస్తులు ధరించాలి..?

ఎందుకంటే అవి, దీపాలకు అంటుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

fashion tips for Selecting perfect Diwali outfit ram
Author
First Published Nov 6, 2023, 1:13 PM IST

దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగ కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూసేవారు కూడా ఉన్నారు. ఈ పండగ రోజున కేవలం ఇంటిని అలంకరించడమే కాదు,  తమను తాము కూడా అందంగా ముస్తాబవ్వాలని అనుకుంటూ ఉంటారు. మరి, అందంగా ముస్తాబవ్వాలంటే మంచి దుస్తులు అవసరం. అయితే, దీపావళి పండగ రోజున అందంగా కనిపించడంతో పాటు, ఎలాంటి దుస్తులు ధరించడం ఉత్తమమో తెలుసుకుందాం...


దీపావళి 2023 ఫ్యాషన్ చిట్కాలు..

దీపావళి పండగ రోజున టపాసులు కాలుస్తాం కాబట్టి, వీలైనంత వరకు సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించడం ఉత్తమం. ఎందుకంటే, టపాసులు కాల్చే సమయంలో పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు కంఫర్ట్ గా లేకపోతే కష్టమౌతుంది. కాబట్టి,   ఆ విషయంలో జాగ్రత్త అవసరం. కాబట్టి, ముందు సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

అగ్ని ప్రమాదాన్ని తగ్గించే దుస్తులను ఎంచుకోండి. దీపావళి సమయంలో, అందరి ఇళ్లలో దీపాలు, కొవ్వత్తులు వెలిగిస్తూ ఉంటారు, అన్ని మూలల్లోనూ వెలిగిస్తూ ఉంటారు.  కాబట్టి, మనం ధరించే దుస్తులు ఎక్కువ పొడవుగా పల్లు పెట్టుకోవడం, దుప్పట్టా వేసుకోవడం లాంటివి నివారించాలి. ఎందుకంటే అవి, దీపాలకు అంటుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

 ఇవి, కాదు అంటే, దీపావళి అందాలలో మెరిసిపోవడానికి  బనారసి సిల్క్, చందేరీ , ఆర్గాన్జా వంటి ప్రకాశవంతమైన , మృదువైన బట్టలను ఎంచుకోండి.

మీరు ఖాదీ వంటి బట్టలతో తయారు చేసిన దుస్తులను ధరించినట్లయితే, దుస్తులకు మరింత తేజస్సును జోడించడానికి ప్రకాశవంతమైన  ఆభరణాలను ఉపయోగించండి.

మిక్సింగ్, మ్యాచింగ్ గురించి భయపడవద్దు. దీపావళి అంటే రంగులు. కాబట్టి, డిఫరెంట్ కాంబినేషన్లు ప్రయత్నించవచ్చు.  క్రాప్ టాప్‌లను బ్లౌజ్‌లుగా ఉపయోగించి, క్లాత్ బెల్టులు వాడి, ట్రెండీగా కనిపించవచ్చు.

మేకప్ శక్తిని తక్కువ అంచనా వేయకండి. మెరిసే ఐ షాడో లేదా బ్రైట్-కలర్ లిప్‌స్టిక్ ఎక్కువ శ్రమ లేకుండా బోరింగ్ దుస్తులను ఎలివేట్ చేయగలదు. ఇక, దీపావళి సమయంలో క్రాకర్స్ కాల్చేటప్పుడు మాస్క్ లు ధరించడం వల్ల  చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios