ఉమన్స్ డే : మహిళలు మీ హక్కుల గురించి మీకు తెలుసా?

 చాలా మంది మహిళలకు ఈ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండటం లేదు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి.

Every woman should know this law


ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళలకు అంకితమైన ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం  ముఖ్య ఉద్దేశ్యం వారి హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడం. నేడు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. అన్ని రంగాలలో స్త్రీ లు అడుగుపెట్టారు. ఇతర దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా మహిళలకు అనేక హక్కులు కల్పించారు. మహిళల కోసం చాలా చట్టాలు ఉన్నాయి. అయితే స్త్రీ ఎంత చదివినా, ఎంత అభివృద్ధి చెందినా ఆమెకు చట్టం, హక్కుల గురించి అంతగా అవగాహన ఉండట లేదు. చాలా మంది మహిళలకు ఈ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండటం లేదు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి.

మహిళలకు ఈ హక్కులన్నీ ఉన్నాయి...


సమాన వేతనం: పురుషుల మాదిరిగానే మహిళలకు కార్యాలయంలో సమాన వేతనం అందుకునే అన్ని హక్కులు ఉన్నాయి. భారతీయ కార్మిక చట్టం ప్రకారం, ఏ ప్రదేశంలోనైనా పనిచేసే మహిళలకు వేతనాలలో లింగం ఆధారంగా వివక్ష ఉండకూడదు. వివక్ష విషయంలో, ఒక మహిళ  కోర్టుకు కూడా  వెళ్లవచ్చు.

గృహ హింస నుండి రక్షణ: ఈ హక్కు  ఉద్దేశ్యం మహిళలపై హింసను నిరోధించడం. దీని ప్రకారం, తన ఇంట్లో లేదా అత్తవారి ఇంట్లో ఒక మహిళపై ఏదైనా హింసకు పాల్పడితే, దానిపై ఫిర్యాదు లేదా కేసు నమోదు చేయడానికి ఆమెకు పూర్తి హక్కు ఉంటుంది. చాలా మంది మర్యాద కోసం ఫిర్యాదు చేయరు. కానీ ఫిర్యాదుదారు పేరు గోప్యంగా ఉంచి కూడా మీరు నమ్మకంగా ఫిర్యాదు చేయవచ్చు.

ప్రసూతి హక్కు: ఒక మహిళ గర్భవతి అయితే 26 వారాల పాటు సెలవు తీసుకునే హక్కు ఉంటుంది. ఈ కాలంలో మహిళా ఉద్యోగి జీతంలో కోత విధించకూడదు. అదనంగా, వారు మళ్లీ పని చేసే అవకాశం ఉంది.

రాత్రిపూట అరెస్టు చేసే హక్కు : ఈ చట్టం ప్రకారం, ఏ పోలీసు అధికారి సూర్యాస్తమయం తర్వాత అంటే రాత్రి సమయంలో స్త్రీలను అరెస్టు చేయలేరు. మహిళ ఏ చట్టాన్ని ఉల్లంఘించినా పోలీసులు ఉదయం వరకు వేచి ఉండాల్సిందే.

పని ప్రదేశంలో వేధింపులు: మహిళా కార్మికులు పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైనట్లయితే, వారు దానిపై ఫిర్యాదు చేయవచ్చు. వారు తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోగలరు.

ఆడ భ్రూణహత్యలకు వ్యతిరేకంగా హక్కు: భారతదేశంలో ఆడ భ్రూణహత్యలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టం ఉంది. ఆడ పిండ పరీక్ష, హత్య రెండింటిపై ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తారు.

ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు: ప్రతి భారతీయ స్త్రీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందుతుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం ప్రకారం వారికి ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉంది.

గౌరవం ,మర్యాద హక్కు: ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళలకు కూడా ప్రత్యేక చట్టం ఉంది. వారి మర్యాద, గౌరవానికి భంగం కలిగించే పనులు చేయకూడదు.  ఏదైనా వైద్య పరీక్షల సమయంలో మహిళా పోలీసుల హాజరు తప్పనిసరి.


వారసత్వంలో సమాన వాటా : హిందూ వారసత్వ చట్టం స్త్రీలు , పురుషులకు వారసత్వంలో సమాన వాటాను అందిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios