Asianet News TeluguAsianet News Telugu

పీరియడ్స్ లో ఈ తప్పులు చేస్తే నొప్పి ఇంకా ఎక్కువవుతుంది జాగ్రత్త..

కొంతమందికి నెలసరిలో విపరీతమైన నొప్పి వస్తుంది. అయితే పీరియడ్స్ సమయంలో కొన్ని తప్పులు చేస్తే కూడా ఈ నొప్పి ఇంకా ఎక్కువవుతుందని నిపుణులు అంటున్నారు. 
 

Avoid these common mistakes that can make your period pain worse rsl
Author
First Published Mar 26, 2023, 4:25 PM IST

పీరియడ్స్ ఒక సహజ ప్రక్రియే అయినప్పటికీ.. కొంతమంది ఆడవారికి ఈ రోజులు కష్టంగా మారుతాయి. పొత్తికడుపులో నొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి, అలసట, అసౌకర్యం వంటి ఎన్నో సమస్యలను ఈ పీరియడ్స్ సమయంలో ఫేస్ చేయాల్సి ఉంటుంది.  కొంతమంది మహిళలకు కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది. మరికొందరు తిమ్మిరి వల్ల నొప్పి కలుగుతుంది. అయితే పీరియడ్స్ టైంలో కొన్ని తప్పులు చేయడం వల్లే ఈ సమస్యలు ఎక్కువ అవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరిని తగ్గించుకోవడానికి చాలా మంది టీ లేదా కాఫీ లను మోతాదుకు మించి తాగేస్తుంటారు. కాస్త  తగ్గినట్టుగా అనిపించినా ఇది సమస్యను ఇంకా పెంచుతుంది. వీటిని తాగడం వల్ల ఒత్తిడి, రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరుగుతాయి. అంతేకాదు టీ లేదా కాఫీని ఎక్కువగా తాగితే రోజంతా అలసిపోయినట్టుగా ఉంటారు. అందుకే ఈ టీ, కాఫీలకు బదులుగా సేంద్రీయ టీ, ఆరోగ్యకరమైన రసాలు, షేక్ లను తాగండి. 

రక్తస్రావం ఎక్కువ కావడం వల్ల బలహీనంగా ఉంటారు. అందుకే ఇలాంటి సమయంలో ఉపవాసానికి దూరంగా ఉండాలి. విటమిన్లు, ఖనిజాలు, కాల్షియంతో సహా మీ శరీరానికి పూర్తి పోషణను అందించడానికి  పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. ఈ సమయంలో భోజనం మానేయడం వల్ల ఎన్నో  అనారోగ్య సమస్యలు వస్తాయి.

పీరియడ్స్ సమయంలో నొప్పి గ్రాహకాలు పెరుగుతాయి. చర్మం మరింత సున్నితంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వ్యాక్సింగ్ చేస్తే నొప్పి మరింత పెరుగుతుంది. పీరియడ్స్ సమయంలో చర్మాన్ని సాగదీయడం వల్ల నొప్పి కలుగుతుంది. అందుకే ఈ సమయంలో వ్యాక్సింగ్ లేదా షేవింగ్ కు దూరంగా ఉండండి. 

బ్లీడింగ్ తక్కువగా ఉందని చాలా మంది మహిళలు రోజంతా ఒక ప్యాడ్ ను మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఇది టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు యోనిలో దురద, బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది. ఈ సమస్యను నివారించడానికి మీ ప్యాడ్ ను రోజుకు మూడుసార్లు మార్చండి. ప్రతి ఆరు గంటలకు ప్యాడ్లను మార్చడం వల్ల చెడు వాసనల నుంచి మరకలు, అసౌకర్యం వంటి సమస్యలు తగ్గుతాయి. 

పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ పాల ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగే అసిడిటీ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. పీరియడ్స్ సమయంలో తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను మాత్రమే తీసుకోండి. ఇది తిమ్మిరి ప్రమాదాన్ని పెంచదు. కాగా పాలను ఎక్కువగా తాగితే మలబద్దకం సమస్య వస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios