ములుగు: తెలంగాణలో కరోనా మహమ్మారి నగరాలు, పట్టణాలను దాటుకుని గ్రామాలకూ చేరుకుంది. ఈ వైరస్ తెలంగాణ గ్రామాల్లోనూ వేగంగా వ్యాప్తిస్తూ మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అజాగ్రత్త, అలసత్వం అధికాకుల నిర్లక్ష్యం కారణంగా ఈ మహమ్మారి ఒకరినుండి ఒకరికి సోకుతూ చిన్న చిన్న గ్రామాల్లోనూ వందల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇలా తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కే పురంలో ఊరిలో100కి పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 

ఈ వైరస్ వ్యాప్తికి గ్రామంలో ఇటీవల జరిగిన ఓ దినకర్మ సహపంక్తి భోజనాలే కారణమని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో దాదాపు సగం మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇలా కేవలం 500జనాభా వున్న గ్రామంలో 100కి పైగా కేసులు బయటపడటం రాష్ట్రంలోని కరోనా పరిస్థితిని తెలియజేస్తోంది. 

read more  షాక్: తెలంగాణలో 69 శాతం మందికి కరోనా లక్షణాలు లేవు

మొత్తంగా చూసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గత 24 గంట్లలో తెలంగాణలో 2817 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 33 వేల 406కు చేరుకుంది.  
  
గత 24 గంటల్లో తెలంగాణ కరోనా వైరస్ కారణంగా 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 856కు చేరుకుంది. హైదరాబాదులో యథావిధిగానే 400కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో లక్షా 13 వేల మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇంకా 32,537 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు

ఆదిలాబాద్ 36
భద్రాద్రి కొత్తగూడెం 89
జిహెచ్ఎంసీ 452
జగిత్యాల 88
జనగామ 41
జయశంకర్ భూపాలపల్లి 26
జోగులాంబ గద్వాల 33
కామారెడ్డి 62
కరీంనగర్ 164
ఖమ్మం 157
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 19
మహబూబ్ నగర్ 42
మహబూబాబాద్ 62
మంచిర్యాల 71
మెదక్ 35
మేడ్చెల్ మల్కాజిరిగి 129
ములుగు 18
నాగర్ కర్నూలు 41
నల్లగొండ 157
నారాయణపేట 21
నిర్మల్ 16
నిజామాబాద్ 97
పెద్దపల్లి 75
రాజన్న సిరిసిల్ల 53
రంగారెడ్డి 216
సంగారెడ్డి 76
సిద్ధిపేట 120
సూర్యాపేట 116
వికారాబాద్ 27
వనపర్తి 45
వరంగల్ రూరల్ 46
వరంగల్ ఆర్బన్ 114
యాదాద్రి భువనగిరి 73
మొత్తం కేసులు 2817