Asianet News TeluguAsianet News Telugu

షాక్: తెలంగాణలో 69 శాతం మందికి కరోనా లక్షణాలు లేవు

తెలంగాణ రాష్ట్రంలో 69 శాతం మందికి లక్షణాలు లేకుండానే కరోనా బారినపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తేల్చింది.  మరో 31 శాతం మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా తేల్చింది.

69 percent of total cases in Telangana State asymptomatic
Author
Hyderabad, First Published Sep 1, 2020, 10:22 AM IST


హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో 69 శాతం మందికి లక్షణాలు లేకుండానే కరోనా బారినపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తేల్చింది.  మరో 31 శాతం మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా తేల్చింది.

తెలంగాణ రాష్ట్రంలో 1,24,,963 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 86,225 మందికి కరోనా లక్షణాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ తేల్చింది. ఇక 38,738 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్య శాక ప్రకటించింది.

లక్షణాలు లేని వారి నుండి ఇతరులకు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. లక్షణాలు లేనివారి నుండి 15 నుండి 20 శాతం మందికి కరోనా సోకినట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  గణాంకాలు చెబుతున్నాయి.

ప్రాథమిక కాంటాక్టుల నుండి రెండో కాంటాక్టు అయిన వారిలలో 5,290 మందికి పరీక్షలు నిర్వహించారు. డైరెక్టు బాధితుల నుండి ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను ట్రేసింగ్ చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ విజయవంతమైంది. రాష్ట్రంలో 31,229 యాక్టివ్ కేసులున్నాయి.వీరిలో 24,216 మంది హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. 

ప్రాథమిక, రెండో కాంటాక్టు ద్వారా అనుమానిత లక్షణాలతో 59 శాతం కరోనా నిర్ఱారణ పరీక్షలు చేయించుకొన్నారు. మిగిలినవారంతా 41 శాతం మంది డైరెక్ట్ బాధితులు.

ఈ నెలాఖరుకు రాష్ట్రంలో కరోనాను కంట్రోల్ లోకి తీసుకొస్తామని వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు. ఈ దిశగా అధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios