పట్టణ ప్రగతికి చిన్నారి బలి: గోడ కూలి బాలిక మృతి, పరామర్శించిన ఎర్రబెల్లి
పట్టణ ప్రగతి కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం వరంగల్ 43వ డివిజన్, హన్మకొండ- కొత్తూరు జెండా ప్రాంతంలో ప్రాక్లెయిన్‌తో చదును చేస్తుండగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో ప్రిన్సీ అనే బాలిక మరణించగా, ఆమె తమ్ముడు గాయపడ్డాడు.

Also Read:వారి పదవులు పోవడం ఖాయం...: మంత్రి హరీష్ రావు
ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడిన ఎర్రబెల్లి .. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.
అక్కడికక్కడే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఆయనకు వివరాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గాయపడిన బాలుడికి వెంటనే మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని డాక్టర్లు, అధికారులను ఆదేశించారు.
Aslo Read:పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించకపోతే పదవుల్లో నుండి తొలగాలి: కేసీఆర్ వార్నింగ్
అనంతరం అంబులెన్స్ లో ఉన్న బాలిక మృత దేహాన్ని చూసి ఎర్రబెల్లి చలించిపోయారు. మృత దేహానికి త్వరితగతిన పోస్టు మార్టం జరిగే విధంగా చూడాలని స్థానిక ఎంజీఎం వైద్యశాల సూపరింటెండెంట్‌ని మంత్రి ఆదేశించారు.