సంగారెడ్డి: ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొత్తగా ఎన్నికయిన మున్సిపల్ కార్యవర్గాలు పనిచేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు  సూచించారు. కొత్త మున్సిపల్ చట్టం  ప్రకారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నిధులు  పుష్కలంగా లభిస్తున్నాయని...  వాటిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారి పదువులు పోవడం ఖామయని మంత్రి హెచ్చరించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఇటీవలే ఎన్నికయిన మున్సిపల్ ఛైర్మన్లు,  కౌన్సిలర్లు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు,ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి  హరీష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా పట్టణాల్లో చేపట్టాల్సిన చేపట్టాల్సిన అభివృద్ది, పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించారు. పట్టణ ప్రగతి పేరుతో పటాన్ చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరిగింది.

read more  డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన... సీఎం కేసీఆర్ కు అరుదైన అవకాశం

ఈ సంధర్భంగా హరీష్ మాట్లాడుతూ... నూతనంగా ఎన్నికయిన మున్సిపల్ కార్యవర్గాలు ఆయా మున్సిపాలిటీల  పరిధిలో ఎలాంటి అవినీతికి తావులేకుండా చూడాలన్నారు.ఎవరైనా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే  ఉపేక్షించబోమన్నారు. పట్టణాల్లో పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని... మున్సిపాలిటీ ఆదాయంలో  పదిశాతం మొక్కల  పెంపకానికి  ఉపయోగించాలని  సూచించారు.

తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కే పట్టం  కడుతున్నారని అన్నారు. వారికి  మెరుగైన పాలన అందించి ఆ నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకుందామని హరీష్ రావు సూచించారు.