మాజీ మంత్రి అయ్యన్నపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి: వైసిపి ఎమ్మెల్యే డిమాండ్
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై అసెంబ్లీ ఎన్నికల తర్వాత మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని... అధికారాన్ని కోల్పోడాన్ని ఆయనింకా జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న కు బెయిల్ రద్దు చేయాలని నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అయ్యన్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే ఆద్వర్యంలో నర్సీపట్నంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీని చేపట్టారు.
బొడ్డేపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి స్థానిక పోలీస్టేషన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఓటమి తర్వాత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మతిభ్రమించినట్లుందని ఎద్దేవా చేశారు. శాంతి భద్రతలను ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న ఆయనపై వెంటనే రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసులకు సూచించారు.
read more మేమూ అలాగే చేస్తే చంద్రబాబు, లోకేశ్ లు తట్టుకోలేరు: మంత్రి అనిల్ స్ట్రాంగ్ వార్నింగ్
పోలీసులను ఉద్దేశించి కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని... వెంటనే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. రానున్న రోజుల్లో మళ్లీ ఇటువంటివి పునరావృతం అయినట్లయితే ధీటుగా సమాధానం చెప్పేందుకు వైయస్సార్ పార్టీ సిద్ధంగా ఉన్నందని ఎమ్మెల్యే గణేష్ మాజీ మంత్రి అయ్యన్నకు గట్టిగా హెచ్చరించారు.
ఈ ర్యాలీలో నర్సీపట్నం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, వైసీపీ టౌన్ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, రూరల్ అధ్యక్షులు సుర్ల సత్యన్నారాయణ, వైసీపీ పట్టణ, రూరల్ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.