పబ్జి ఆడుకునే వారిని  వీడియో గేమ్స్ ఆడుకునే వాళ్లని రాష్ట్రంపై రుద్దింది చంద్రబాబు నాయుడేనన్నారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి. వీడియో గేమ్ ఆడుకునే లోకేశ్‌ను మంత్రిగా చేశారని అమర్‌నాథ్ సెటైర్లు వేశారు.

రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకమైన సమాధానం ఇచ్చిందన్నారు అమర్‌నాథ్. కానీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కి మాత్రం అర్థం కావట్లేదని ఆయన ధ్వజమెత్తారు.

Also Read:ఆందోళనలకు కౌంటర్: వైఎస్ జగన్ తో అమరావతి రైతుల భేటీ

పార్లమెంట్ లో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజధాని గురించి సమాధానం చెప్పారని గుర్తుచేశారు. ఇంకా రాజధాని చుట్టూ రైతులను చంద్రబాబు నాయుడు మభ్య పెడుతున్నారని అమర్‌నాథ్ ఆరోపించారు.

చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం క్యాపిటలిస్టు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు అనే అంశం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం  జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అమర్‌నాథ్ గుర్తుచేశారు.

అసలు కొత్త రాష్ట్రం అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే  చంద్రబాబు నాయుడు రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల్ని అప్పుల్లో ఉంచారని ఆరోపించారు. హైదరాబాదులో  ఉండమని చెప్తే ఓటుకు నోటు కేసు తో రాజధాని విడిచి వచ్చిన ఘనుడు చంద్రబాబని అమర్‌నాథ్ తెలిపారు.

Also Read:జగన్ కి ఊరట... మూడు రాజధానులపై కేంద్రం వైఖరి ఇదే..

తెల్ల కార్డులు వున్న వ్యక్తులు  కోట్ల రూపాయల విలువ చేసే భూములు కొనకూడదా అని ప్రతిపక్షనేత ప్రశ్నిస్తున్నారని.. తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు భూములు కొనచ్చు కానీ వారి పేరిట బినామీలు భూములు కొనడం తప్పని అమర్‌నాథ్ హితవు పలికారు. విశాఖ వద్దని చెబుతున్న చంద్రబాబు నాయుడుకి ఉత్తరాంధ్ర అంటే ఎందుకు అంత అక్కసని ఎమ్మెల్యే నిలదీశారు.