విశాఖపట్నం: ఆన్లైన్ లో జూదానికి బానిసై ఆరు లక్షల పోగొట్టుకుని ఓ యువకుడు చివరికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన  విశాఖ జిల్లాలో జరిగింది. విశాఖపట్నం జిల్లాలోని కొత్తూరు గ్రామానికి చెందిన దొడ్డి వెంకట్ అరవింద్ అనే యువకుడు(24) తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు.

ఒరిస్సా రాష్ట్రం రాయగడలో ప్రైవేట్ మైనింగ్ కంపెనీ లో జూనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు మూడు రోజుల క్రితం తన తల్లి వద్దకు వచ్చాడు. ఆన్లైన్లో జూదానికి బానిసైన యువకుడుమూడు రోజులుగా  ఆన్లైన్లో జూదం ఆడుతూ ఆరు లక్షలు రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు ఏం చెప్పాలో  అర్థం కాక భయంతో ఉరివేసుకుని చనిపోయినట్టుగా స్నేహితులు భావిస్తున్నారు.

తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్  ఎస్ఐ చక్రధరరావు మాట్లాడుతూదొడ్డి వెంకట్ అరవింద్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని  చనిపోయాడని,  కేసు విచారణ చేపట్టి రెండు మూడు రోజుల్లో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రిలోని  మార్చురీకి తరలించారు