ప్రియుడ్ని కిడ్నాప్ చేయడానికి ప్రియురాలు ప్రయత్నించడంలో ప్రియుడి తండ్రి చనిపోయిన దారుణ ఘటన విశాఖలో జరిగింది. విశాఖ జిల్ల తగరపు వలస బాలాజీనగర్ కి చెందిన రౌతు వంశీకృష్ణ మద్యాహ్నం  అదేప్రాంతంలో తండ్రి వెంకటరావు నడిపే చికెన్ షాపుకు వెడుతున్నాడు. 

ఈ క్రమంలో జాతీయ రహదారి అండర్ పాస్ వంతెన కింద నలుగురు యువకులతో కలిసి 35యేళ్ల ఓ మహిళ మాటువేసి వంశీకృష్ణను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. చికెన్ షాపుకు దగ్గర్లోనే ఇది జరగడంతో గమనించిన వెంకటరావు పరిగెత్తుకొచ్చాడు. నా కొడుకు దగ్గరికెందుకు వచ్చావు అంటూ ఆమెను నిలదీసాడు. 

దీంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో వెంటరావు అక్కడికక్కడే కుప్పకూటి ప్రాణాలు విడిచాడు. ఇది గమనించిన ఆ మహిళ, నలుగురు యువకులు కారులు పారిపోయారు. 

శ్రీకాకుళానికి చెందిన ఆ మహిళ ఇద్దరు పిల్లలు, భర్తతో రెండేళ్ల కిందట బాలాజీనగర్ లో ఉన్నారు. ఈ క్రమంలో వంశీకృష్ణతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఇంట్లోనుండి పారిపోయారు. ఆ తరువాత దొరికారు. అనంతరం జరిగిన గొడవల్లో వంశీ నాన్న వెంకటరావు ఆ మహిళకు రెండు లక్షలిచ్చి తన కొడుకు జోలికి రావద్దని పేపర్స్ రాయించుకున్నారని మృతుని భార్య తెలిపింది. 

వెంకటరావు భార్య ఫిర్యాదు మేరకు మధురవాడ ఏసీపీ రవిశంకర్ రెడ్డి నిందితులపై 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.