విశాఖపట్నంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ లాడ్జిలో ఓ కుటుంబంమొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లల మృతదేహాలను లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దుర్ఘటన గురించి బయటపడింది. 

వివరాల్లోకి వెళితే... విశాఖ నగరంలోని అశ్వినీ లాడ్జ్ లో పెందుర్తి సమీపంలోని బంధుపాలెం గ్రామానికి చెందిన ఓ కుటుంబం దిగింది. భార్యభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు రూమ్ నెంబర్ 106 లో బసచేశారు. అయితే వారంతా బుధవారం లాడ్జి రూంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. 

ఈ ఆత్మహత్యలను గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు లాడ్జీకి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఆత్మహత్యలకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.