విశాఖపట్నం: బిజెపి నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి తాళ్లరేవు అఖిల పక్ష నేతల నుంచి షాక్ ఎదురైంది. కోరింగ బీ ఫార్మసీ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన జరిగే కార్యక్రమానికి వస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. 

కోరింగలో జరిగిన మీడియా సమావేశంలో అఖిల పక్ష నాయకులు టేకుమూడి ఈశ్వర రావు, ముత్యాల శ్రీజయలక్ష్మి, కట్టా త్రిమూర్తులు మాట్లాడారు. ఫార్మసీ కళాశాలలో విద్యార్థినిపై అత్యాచారయత్నం చేస్తుంటే పోలీసులు కళాశాల డైరెక్టర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని వారు గుర్తు చేశారు 

ఆ కళాశాలకు పురంధేశ్వరి వస్తే మహిళలను కించపరచడమే అవుతుందని వారన్నారు. పురంధేశ్వరి వస్తే తాము అడ్డుకుని తీరుతామని వారు హెచ్చరించారు 

మీడియా సమావేశంలో అత్తిలి బాబూరావు, టేకుమూడి లక్ష్మణ రావులతో పాటు టీడీపీ, సీపీఎం, జనసేన నాయకులు పాల్గొన్నారు.