జగన్‌ విశాఖ పర్యటనకు వచ్చిన వారిలో వైసీపీ నేతలు డబ్బులిచ్చి లారీలు, బస్సుల్లో తీసుకువచ్చిన వారే తప్ప  స్వచ్చందంగా వచ్చినవారెవరు లేరని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోపించారు. 

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌ విశాఖ పర్యటనలో స్వాగతం పలికేందుకు వైసిపి నాయకులు పెయిడ్‌ ఆరిస్ట్‌లతో మానవహారాలు నిర్వహించినట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోపించారు. విశాఖను రాజధానిగా ప్రకటించినందుకు ప్రజలే స్వచ్చందంగా మాననహారం నిర్వహించినట్లుగా వైసిపి నాయకుల చెప్పటం సిగ్గుచేటని అన్నారు. 

జగన్‌ విశాఖ పర్యటనకు వచ్చిన వారిలో వైసీపీ నేతలు డబ్బులిచ్చి లారీలు, బస్సుల్లో తీసుకువచ్చిన వారే తప్ప స్వచ్చందంగా వచ్చినవారెవరు లేరన్నారు. విధ్యార్దులను, ప్రజలను బలవంతంగా వైసీపీ నాయకులు తరలించి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. సీఎం పర్యటనలో ప్రజల కన్నా.. వైసీపీ నేతలు, పోలీసులు, పెయిడ్‌ ఆర్టిస్ట్‌లే ఎక్కువగా ఉన్నారన్నారు. 

జగన్‌ విశాఖను ఏం ఉద్దరించాడని విశాఖ ప్రజలు సంబరాలు, మానవహారాలు నిర్వహిస్తారో వైసీపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. హుద్‌ హుద్‌ తుఫాన్‌ సమయంలో జగన్‌ ప్రజలను కనీసం పరామర్శించనందుకు సంబరాలు చేసుకుంటారా లేక విశాఖలో జగన్‌, ఆయన అనుచరులు 6 వేల ఎకరాల ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు ప్రజలు మానవహారాలు నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.

read more విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించిన జగన్... నగరవాసులకు నిరాశ

అంతేకాకుండా లులు గ్రూప్‌, ప్ల్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, అదాని డేటా సెంటర్‌ వంటి పలు ఐటి కంపెనీలను విశాఖ నుంచి వెళ్లగొట్టి ఉద్యోగాలు రాకుండా లక్షలాది యువతకు అన్యాయం చేసినందుకు సంబరాలు నిర్వహిస్తారా అని అంటూ వైసిపి నేతలను నిలదీశారు. 

జగన్‌ 3 రాజధానుల ప్రకటనపై విశాఖ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. వైసీపీ నేతలు మాత్రం పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో సన్మానాలు, సంబరాలు, మానవహారాలు నిర్వహించుకోవటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

read more అందుకోసమే ఇంగ్లీష్ మీడియం... తెలుగు భాషను విస్మరించడానికి కాదు: అంబటి

40 వేల మందితో 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహిస్తామన్న విజయసాయిరెడ్డి పెయిడ్‌ బ్యాచ్‌తో కనీసం ప్లైఓవర్‌ కూడా నింపలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్‌ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరని... ఉత్తరాంధ్ర ప్రజల దృష్టిలో ముఖ్యమంత్రి జగన్‌ మోసకారిగా మిగిలిపోయారని బ్రహ్మం చౌదరి విమర్శించారు.