విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని గుడ్లవానిపాలెంలో  శుక్రవారం నాడు తెల్లవారుజామున గ్యాస్ లీక్ చేసుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన  విశాఖలో సంచలనం సృష్టించింది.

గుడ్లవానిపాలెంలో ఉమా మహేశ్వర్ రావు, ఆయన కొడుకు సతీష్ చంద్ర, కూతురు లావణ్యలు గ్యాస్ సిలిండర్ లీకైన ఘటనలో మృతి చెందారు.అయితే తొలుత ఈ ఘటనను అంతా  ప్రమాదంగా భావించారు. కానీ, ఉద్దేశ్యపూర్వకంగానే గ్యాస్ సిలిండర్ ను లీక్ చేసుకొని వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు.

ఆత్మహత్యను తాము ఎలా ప్లాన్ చేసుకొన్నారో సతీష్ చంద్ర, లావణ్య మినిట్ మినిట్ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ నోట్ ఆధారంగా ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

పేలుడు సంబవించిన వెంటనే  స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే సమయంలోనే లావణ్యతో పాటు సతీష్ చంద్ర మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉమామహేశ్వర్ రావు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు.అయితే ఉమా మహేశ్వర్ రావుతో పాటు ఆయన కొడుకు, కూతురు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.