విజయనగరం: గత  జూలై నెల నుంచి డిసెంబర్ వరకు  పట్టపగలే వరుస దొంగతనాలకు పాల్పడిన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల పత్తికాయపాలవలస గ్రామానికి చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పున్నాన రాంబాబు అనే యువకుడు  రాజాం పట్టణ ప్రైవేటు కార్పొరేషన్ బ్యాంకు లో 330 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టిన వివరాలను రాబట్టారు. 

ప్రైవేటు కార్పొరేట్ బ్యాంకుల్లో ఉన్న బంగారం విడిపించి, బాధితులకు న్యాయం జరిగే విధంగా వేగవంతంగా కేసును పోలీసులు కేసును ఛేదించారు.  మీడియా సమావేశంలో మొత్తం బంగారాన్ని ప్రవేశపెట్టారు. గతంలో కూడా ముద్దాయి పేరుమీద విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన కేసు కూడా ఉంది. 

అప్పులపాలై, చోరీ చేసిన ఘటనకు సంబంధించి విజయవాడలో కూడా కేసు నమోదు అయిందని, విజయనగరం జిల్లాలో ఆరు కేసులు, శ్రీకాకుళం జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయని రాజాం పట్టణ సిఐ సోమశేఖర్ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ లే ప్రధాన కారణంగా వరుస దొంగతనాలు చేస్తూ వచ్చాడని, ఈ క్రమంలో రాజాం పట్టణ పరిసర గ్రామ ప్రాంతమైన పోగిరిలో నిందితుడు చేసిన దొంగతనాన్ని ఛేదించినట్లు ఆయన తెలిపారు. 

వేలిముద్రల ఆధారంగా త్వరితగతిన నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు. దితుడు తెలిపిన వివరాల ప్రకారం వివిధ కార్పొరేట్ బ్యాంకులలో వివిధ వ్యక్తుల చేత బంగారం పద్దు పెట్టినట్టు నిర్ధారణ చేసి, బంగారం ను స్వాధీనపరచకున్నట్టుగా మీడియా సమావేశంలో చెప్పారు. 

చోరీ కేసును చాకచక్యంతో వేగవంతంగా పూర్తి చేసిన ఎస్సై.రాముకు, క్రైమ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.నవంబరు 19 మంగళవారం ఉదయం గవరాచీపురుపల్లి జంక్షన్ వద్ద పల్సర్ బైక్ పై ఉన్న రాంబాబు ను గుర్తించి, అతను 305 గ్రాముల బంగారం దొంగతనాలకు పాల్పడినట్లు  నిర్ధారణ చేసుకున్నారు. 

ఆ తర్వాత ముద్దాయి ఇంటికి వెళ్లి తనిఖీ చేసి తులం బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. రాజాం స్టేషన్ కు తరలించి అరెస్ట్ చేసి  రిమాండ్ కు పంపించారు, ముద్దాయిని ప్రశ్నించి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడి వివిధ బ్యాంకులలో వివిధ వ్యక్తుల చేత తాకట్టు పెట్టించాడనే  విషయాన్ని ఆరా తీసి శుక్రవారం మీడియా సమావేశంలో 330 గ్రాముల బంగారం ప్రవేశపెట్టారు.