విశాఖపట్నం: కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో విధించిన లాక్ డౌన్ కారణంగా విశాఖలో చిక్కుకుపోయిన జపానీయులను ఆదేశానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖ లో చిక్కుకుపోయిన ఆరుగురి జపానీయులతో పాటు దేశ వ్యాప్తంగా వున్న జపానీయులను వారి దేశం పంపేందుకు ఏర్పాట్లు చేశారు. 

విశాఖ నుండి ఆరుగురు జపానీయులను బెంగళూరు  తీసుకుని వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ ఆరుగురిని తీసుకుని వెళ్లేందుకు ఢిల్లీ నుంచి విశాఖ వచ్చింది. ఆ ప్రత్యేక విమానంలో వారు బెంగుళూరు నుండి జపాన్ వెళ్లనున్నారు.

ఇదిలావుంటే, రెడ్ జోన్ గా ప్రకటించిన అక్కయ్యపాలెం , తాటిచెట్లపాలెం ప్రాంతాల్లో విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు ,రాష్ట్ర మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ పార్లమెంట్ సభ్యులు  ఎంవీవి సత్యనారాయణ జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్  విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె రాజు  ప్రముఖ ఆడిటర్ జి.వి శనివారం పర్యటించారు. 

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ అక్కడ తీసుకుంటున్న ముందస్తు చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వారు ఇంటినుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఇక్కడ ప్రజలకు నిత్యవసర వస్తువులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో బానాల శ్రీను, పి.ఉషా శ్రీ, ఆళ్ళ శివ గణేష్, పైడి రమణ, జీవీఎంసీ అధికారులు, డాక్టర్లు, పోలీస్ సిబ్బంది,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.