విశాఖలో విరిగిపడిన కొండచరియలు: రైల్వే ఉద్యోగి దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో రైల్వే ట్రాక్ పై పనులు చేస్తుండగా కొండచరియలు విరిగిపడడంతో ఓ రైల్వే ఉద్యోగి మరణించాడు. రైల్వే ఉద్యోగులు, కాంటాక్ట్ కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం చీముడుపల్లి గ్రామసమీపంలో విశాఖ కిరాండాల్ రైల్వే లైన్ రిపేర్ పనులు జరుగుతుండగా వీరి పై అకస్మాత్తుగా కొండ చరియలు విరిగిపడ్దాయి. దీంతో శృంగవరపుకోట రైల్వే ఓహెచ్ డిపార్టుమెంట్ కు చెందిన వి. సురేష్ అనే ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ పనులలో కొత్తవలస కు చెందిన ముగ్గరు కాంట్రాక్ట్ కార్మికులకు, ముగ్గురు రైల్వే ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో హుటాహుటిన శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వీరి పరిస్థితి విషమంగా ఉండటం తో ప్రధమ చికిత్స చేసి విశాఖ కు తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని ఆసుపత్రి డాక్టర్ సుధ తెలిపారు.
మృతుడు సురేష్ కు భార్య విమల, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఎప్పటిలా ఉద్యగానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న భార్య పిల్లలు విగత జీవిగా రావటంతో వారి భాద వర్ణనాతీతం.సంఘటనా స్థలంలో ప్రమాదం జరిగిన సమయంలో సుమారు ఎనబై మంది వరకు కూలీలు ఉండి ఉంటారని అంచనా. శిథిలాల కింద చిక్కుకున్నవారి రైల్వే శాఖా కొనసాగింపు చర్యలు చేపట్టింది.