విశాఖపట్నం: ఆదివారం చిన్నారులకు ఆరోగ్యం కోసం ఏర్పాటుచేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇ-అర్బన్ హెల్త్ సెంటర్, విద్యుత్ నగర్, అక్కయ్యపాలెంలలో పోలీయో చుక్కల కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన స్వయంగా పలువురు చిన్నారులకు పోలీయో చుక్కలు వేశారు. 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జిల్లాలో 5 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు 4.50 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ సంవత్సరం పోలియో చుక్కలు వేయించాలన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు తమ తల్లిదండ్రులు వేయించి అంగవైకల్యం నివారించాలన్నారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు ఉంటుందన్నారు. 

ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరాలని చెప్పారు.  అందుకు అధికారుల యొక్క సహాయ సహకారాలు ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైయస్ఆర్ కంటివెలుగు ద్వారా జిల్లాలో 13 వేల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే కెజిహెచ్ ను సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

త్వరలోనే పాడేరులో వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. 

17 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 27 మందికి లబ్దిదారులకు మంత్రి అందజేశారు. వైయస్ఆర్ కంటి వెలుగులో భాగంగా కంటి అద్దాలను మంత్రి, కలెక్టర్ లు పిల్లలకు అందించారు. అనంతరం స్కూల్ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వి వినయ్ వి వినయ్ చంద్, ఎంఆర్డిఏ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి సృజన, వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు సావిత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుపతిరావు, జివిఎంసి సిఎంఓ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ... పోలియో చుక్కలు పిల్లలందరికి వేయించాలన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ... 4.50 లక్షల పిల్లలు జిల్లాలో ఉన్నారని, వారందరికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని... తల్లిదండ్రులు విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో పోలియో చుక్కలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జిల్లాలో 400 సబ్ సెంటర్లు మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ, 104 సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ఎంఆర్డిఏ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ పల్స్ పోలియో అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారని, ప్రజల్లో అవగాహన పెంచుకోవాలన్నారు. అంగవైకల్యం నివారించవచ్చన్నారు. ప్రతీ గర్భిణీ లకు పౌష్టికాహారం ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాలన్నారు.

జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ పిల్లలందరికి విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రాల్లో పల్స్ పోలియో చుక్కలు అందుబాటులో ఉంటుందని, 5 సంవత్సరాల లోపు పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలన్నారు,