కుట్రలు,కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్యన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బాబు ఎన్ని కుట్రలు చేసినా జనం జగన్ వెంటే ఉన్నారని తెలిపారు

కుట్రలు,కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్యన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బాబు ఎన్ని కుట్రలు చేసినా జనం జగన్ వెంటే ఉన్నారని తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అన్ని ప్రాంతాల అభివృధ్దికి టీడిపి అడ్డుపడుతోందని.. అవినీతిపై యుధ్దం చేస్తుంటే టిడిపికి భయం పట్టుకుందని అవంతి విమర్శించారు. టిడిపి నేతలు రోజుకో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. విశాఖలో టిడిపి నేతల భూదాహానికి అడ్డేలేదని ఆయన ఆరోపించారు.

Also Read:బిజెపితో పవన్ పొత్తు వెనుక చంద్రబాబు: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

ఆక్రమణలు ,భూకభ్జాల విషయంలో ఎవరిని ఉపేక్షించవద్దని సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. అభివృధ్ది వికేంద్రీకరణతో రాష్ర్ట అభివృధ్ది సాధ్యమన్నారు.

గ్రాఫిక్స్‌తో తాము మాయ చేయడం లేదని పూటకోమాట చెప్పి చంద్రబాబు చివరికి చేతులెత్తేశారని శ్రీనివాస్ సెటైర్లు వేశారు.-ఇలాంటి కుట్రలు చేస్తే చివరకు ఆ 23 సీట్లు కూడా రావని.. ఉత్తరాంధ్రకు టిడిపి చేసిందేమి లేదని అవంతి గుర్తుచేశారు.

Also Read:అందుకోసమైతే చంద్రబాబు దేనికైనా సిద్దం...లేకపోతే మాత్రం..: మంత్రి అవంతి

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వద్దనుకుంటే మీ(టిడిపి) నలుగురు విశాఖ ఎంఎల్‌ఏలతో రాజీనామా చేయించగలవా అని మంత్రి సవాల్ విసిరారు. మా పార్టీలో సూపర్ సిఎంలు ఎవరూ లేరని.. అమరావతిని అభివృధ్ది చేసే బాధ్యత మాదేనని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

పేదప్రజలకు ఇవ్వడానికే భూములు సేకరిస్తున్నామని.. ఉగాదికి 25 లక్షల ఇళ్లపట్టాలు ఇస్తున్నామని అవంతి వెల్లడించారు. ఆసియాలో విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని.. విశాఖలో ల్యాండ్ మాఫియాను పూర్తిగా కంట్రోల్ చేశామన్నారు.