Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 2-3 సీట్లు కూడా రావు: వైసిపి నేత

విశాఖపట్నం- వైయస్ఆర్సీపీ కార్యాలయం నవంబరు 11, 2019  ఆంధ్రప్రదేశ్ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తూ..  అప్రదిష్టపాలుజేసే విధంగా.. తెలుగుదేశం పార్టీ ఈ- పేపర్ లో రాసిన రాతలపై చంద్రబాబు, లోకేష్ లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ కరణం ధర్మశ్రీ ఆరోపించారు. 

karanam dharmasree shocking comments on tdp
Author
Visakhapatnam, First Published Nov 11, 2019, 8:44 PM IST

ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర బిడ్డ, బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్ స్పీకర్ గా ఎన్నికైతే.. ఒక బలహీనవర్గానికి చెందిన వ్యక్తి ఆ కుర్చీలో కూర్చున్నాడన్న అక్కసుతో చంద్రబాబు, లోకేష్ లు ఇంత నీచానికి పాల్పడ్డారు.  స్పీకర్ ను వీడు-వాడు అని, ఆంబోతు అని, దున్నపోతు అని రాతలు రాశారంటే.. ఏక వచనంతో సంబోధించారంటే.. చంద్రబాబు, లోకేష్ లకు ఎంత కుల దురఅహంకారం.

మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో మొత్తంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు తలరాతలు మార్చే నిర్ణయాలు చేస్తుంటే.. ఆ అక్కసుతోనే బీసీ వర్గానికి చెందిన స్పీకర్ పై కారుకూతలు కూస్తారా..అవాకులు, చవాకులు పేలతారా. చంద్రబాబు ఇదే కుల దురఅహంకారంతో విర్రవీగితే.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడొచ్చిన 23 సీట్లు కాదు కదా..  2-3 సీట్లు కూడా రావు.   

తెలుగుదేశం పార్టీకి బీసీలే సమాధి కట్టే రోజు త్వరలోనే వస్తుంది.   బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇంగ్లీషు మీడియం చదువులు చదివితే.. వారు ఎక్కడ బాగుపడతారో అని చంద్రబాబు దానిపైనా రాజకీయం చేస్తున్నాడు.  బీసీలు బాగుపడితే... బీసీలు ఉన్నత పదవుల్లో ఉంటే.. బీసీలు పెద్ద చదువులు చదువుకుంటే.. చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట  కుల అహంకారంతో.. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు తక్షణం ఆయన కాళ్ళు పట్టుకుని చంద్రబాబు, లోకేష్ లు క్షమాపణ చెప్పాలి.  

వారు చేసిన కామెంట్సే.. మూమెంట్ గా మారి బీసీలు అంతా వారికి, వారి పార్టీకి తగిన బుద్ధి చెబుతారు.  వీకర్ సెక్షన్ కు చెందిన వ్యక్తి స్పీకర్ అయితే..  ఆయన్ను వీకర్ గా భావిస్తారా.. ఇది వారి కుల దుర అహంకారానికి నిదర్శనం. - ఇలాంటి కూతలు కూస్తే.. బీసీలు అంతా ఏకమై మీ తలరాతలు మారుస్తాం. - భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి స్థానం లేకుండా భూస్థాపితం చేస్తాం. 

బీసీలు, ఎస్సీలు, మైనార్టీలే ఎక్కువ మంది అగ్రిగోల్డ్ బాధితులుగా ఉన్నారని.. వారికి అన్యాయం చేసిన చంద్రబాబును మడత పెట్టారని స్పీకర్  అంటే తప్పేంటి. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేద్దామని చూసింది చంద్రబాబు, లోకేష్ లు కాదా.. వారికి అన్యాయం చేసింది,  300 మందికి పైగా వారి చావులకు కారణమైంది చంద్రబాబు కాదా. 

మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి రాగానే.. అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1150 కోట్లు కేటాయించి.. తొలివిడతగా రూ. 10 వేల లోపు ఉన్న డిపాజిట్ దారులకు రూ. 264 కోట్లు కేటాయించారు. అలానే రూ. 20 వేలు లోపల ఉన్న డిపాజిట్ దారులకు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఒక ప్రైవేట్ సంస్థ డిపాజిట్ దారులను మోసం చేస్తే.. ప్రభుత్వమే ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవడం ఇదే ప్రథమం.   40 ఇయర్స్ ఇండస్ట్రీ.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి.. 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడినని చెప్పుకునే చంద్రబాబుకు ఎందుకు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని అనిపించలేదు. 

ఆయన బుర్ర ఎక్కడ ఉంది.. చంద్రబాబు తెలివి ఏమైంది.  అచ్చెన్న, అయ్యన్న, బుచ్చెన్న.. ఇలాంటి వాళ్ళంతా ఇసుకను దోపిడీ చేసి.. ఖజానాకు కన్నాలు వేసి మాపై విమర్శలు చేస్తారా. అన్నం పెట్టే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అయితే.. కన్నాలు పెట్టే వారు తెలుగుదేశం నాయకులు' అని  ధర్మ శ్రీ మాట్లాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios