విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జనసేన కార్యకర్త ఆత్మహత్య కలకలంరేపింది. రమణ మూర్తి అలియాస్ జానీ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ముగ్గురు వేధింపులతో ఆత్మహత్య పాల్పడుతున్నట్టు లేఖ రాశారు. తన మరణానికి ప్రదీప్, రాజీ, బాలాజీ అనే ముగ్గురు కారణమన్నారు. 

సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జానీ జనసేన పార్టీలో కీలక కార్యకర్తగా ఉన్నారని.. ఆయన అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గాజువాకలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

విశాఖపట్నం జిల్లా గాజువాకలో వ్యక్తి బ్లేడ్ తో కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు.ఏలూరు చెందిన సంద్య మొసయ్య అనే భార్యభర్తలు పొట్టకూటి కోసం 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని వచ్చి గాజువాకలో కూలిపనులు చేసుకుంటు ఉంటున్నారు.   

భార్యభర్తల మద్య వివాదం పుట్టింటికి వెళ్ళిపోతానన్ని భార్య బెదిరించటంతో భర్త మొసయ్య బ్లేడుతో ఆత్మహత్య యత్నం చేసుకోవటంతో స్దానికులు ఆసుపత్రికి తరలించారు. గాజువాక పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.