విశాఖపట్నం: ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య అనుమాన భూతం చిచ్చు పెట్టి హత్యకు దారి తీసింది. విశాఖపట్నంలోని పద్మనాభంలో వివాహిత భర్త చేతిలో హత్యకు గురైంది. నవీన్ కుమార్, పద్మ ప్రేమించి సింహాచలం వద్ద గుడిలో వివాహం చేసుకున్నారు.

వారు పద్మనాభంలో ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడని భార్య అనుమానిస్తూ వచ్చింది. దాంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా గత రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత భార్య అతని సెల్ చెక్ చేసింది. ఫోన్ నెంబర్లు చూసి భర్తను లేపి గొడవకు దిగింది. ఈ గొడవలో నవీన్ కుమార్ భార్య పద్మను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలకు ఈ వీడియో చూడండి.

"