విశాఖలో కీలేడీల హానీ ట్రాప్: డేటింగ్ సైట్ల ముసుగులో యువకులకు వల

డేటింగ్ సైట్ల ముసుగులో కీలేడీల ముఠా యువతుల మార్ఫింగ్ ఫొటోలతో యువకులకు వల వేస్తున్న విషయాన్ని విశాఖపట్నం పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ కేంద్రంగా హనీ ట్రాప్ గ్యాంగ్ పనిచేస్తున్నట్లు సమాచారం

Honey trap at Visakha: Cheating with dating sites, 26 arrested

విశాఖపట్నం: డేటింగ్ సైట్ల ముసుగులో యువకులకు వల వేస్తున్న హనీ గ్యాంగ్ ను విశాఖపట్నం పోలీసులు గుర్తించారు. దీని వెనక ఉన్న కీలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హానీ గ్యాంగ్ గుట్టు రట్టయింది. బాధితుడు హనీ గ్యాంగ్ వలలో చిక్కుకుని 17 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఈ ముఠా పనిచేస్తున్నట్లు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. 

పోలీసు ఉన్నతాధికారి గోపీనాథ్ నేతృత్వంలోని పోలీసు బృందం కోల్ కతా వెళ్లి స్థానిక పోలీసులు సహాయంతో హనీ ట్రాప్ గ్యాంగ్ కు సంబంధించిన కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని స్థానిక కోర్టులో హజరు పరిచి పీటీ వారంట్ పై విశాఖకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

హనీ గ్యాంగ్ యువకులకు లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన యువతుల ఫొటోలు వెబ్ సైట్లలో పెట్టి వల వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్యాంగ్ కు సంటబంధించిన మూడు ల్యాప్ టాప్ లను, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హానీ ట్రాప్ గ్యాంగ్ కు సంబంధించిన సమాచారం గత మూడేళ్లుగా పోలీసులకు అందుతోంది. అప్పటి నుంచి కూపీ లాగుతూ వచ్చారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటువంటి హనీ ట్రాప్ గ్యాంగ్ ల ఉదంతాల విషయం బయటపడుతున్న విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios