విశాఖలో నకిలీ వైద్యుడి రాసలీలలు: వివాహితలే అతని టార్గెట్
వివాహిత మహిళలను టార్గెట్ చేసుకుని వారిని శారీరకంగా లోబచరుచుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న నకిలీ డాక్టర్ ఆటను కట్టించారు విశాఖ పోలీసులు. అతని బారిన 20 నుంచి 30 మంది మహిళలు పడినట్లు పోలీసులు గుర్తించారు.
విశాఖపట్నం: వివాహితలను లక్ష్యంగా ఎంచుకుని వారిని లోబరుచుకుని మోసం చేస్తున్న నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని అసలు పేరు వంకా కుమార్. కంచరపాలెంలో ఉండే అతను అజిత్ కుమార్ పేర డాక్టర్ అవతారం ఎత్తాడు. కారు డ్రైవర్ గా పనిచేసే అతను కేర్ ఆస్పత్రి సమీపంలో ఉంటాడు.
ఆస్పత్రి వైద్యుడిగా అజిత్ కుమార్ పేర చెలామణి అవుతూ పలువురు మహిళను లోబరుచుకుని మోసం చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. అతని బారిన పడి లైంగిక దోపిడీకి గురైనవారు 20 నుంచి 30 మంది దాకా ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పరువు పోతుందనే భయంతో చాలా మంది ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
చివరకు వేపగుంటకు చెందిన 31 ఏళ్ల మహిళ చేసిన ఫిర్యాదుతో అతని గుట్టు రట్టయింది. ఆమె ఫిర్యాదును తొలుత స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. స్పందనకు ఫిర్యాదు చేయడంతో అది నగర పోలీసు కమిషనర్ మీనా దృష్టికి వెళ్లింది. మీనా అతని వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ విభాగానికి అప్పగించారు. ఈ విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో నకిలీ డాక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బీచ్ రోడ్డు ప్రాంతంలో మార్నింగ్ వాక్ కు వచ్చే మహిళలతో పరిచయం చేసుకునేవాడు. లావుగా ున్నారని, డైట్ అవసరమని చెప్పి తాను సలహా ఇస్తానని ఫోన్ నెంబర్ ఇచ్చేవాడు. ఆ తర్వాత వారితో ఫేస్ బుక్ ద్వారా సంబంధం పెట్టుకుని వారిని శారీరకంగా లోబరుచకునేవాడని చెబుతున్నారు. తనతో మహిళలు సాన్నిహిత్యంగా ఉన్న దృశ్యాలను వీడియో తీసేవాడు. వాటిని చూపించి బ్లాక్ మెయిల్ డబ్బు, నగలు దోచుకునేవాడు.
అతన్ని పట్టుకుని పోలీసులు విచారణ చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. 20-30 మంది మహిళలను అతను మోసం చేసినట్లు విచారణలో తేలింది. పరువు పోతుందనే భయంతో చాలా మంది విషయాన్ని బయటకు చెప్పలేదు. చివరకి ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నకిలీ డాక్టర్ గుట్టు రట్టయింది.
అజిత్ కుమార్ కు కంచరపాలెంలో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. డిజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో తాము సమగ్ర దర్యాప్తు జరిపామని, విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. అజిత్ కుమార్ చేతిలో మోసపోయిన మహిళలు తమకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచాతమని ఆయన చెప్పారు