లంగరుఖానా భూముల వ్యవహారం... విశాఖ అసిస్టెంట్ కమీషనర్ పై సస్సెన్షన్ వేటు
దేవాదాయ శాఖకు సంబంధించి రూ.300 కోట్ల విలువైన భూముల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
విజయవాడ: దేవాదాయ శాఖకు చెందిన భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఏపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దేవాదాయశాఖ భూముల వ్యవహరంలో ఎవరు అక్రమాలకు పాల్పడినా...ఎవరు ఆక్రమించాలని ప్రయత్నించినా ఇలాంటి కఠిన చర్యలే తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
విశాఖ జిల్లా బీమిలిలోని లంగరుఖానా సత్రం ఈవో మరియు విశాఖపట్నం అసిస్టెంట్ కమీషనర్‌ను సస్పెండ్ చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. సత్రం భూముల వేలం వాయిదా వేసినట్టు మంత్రి పేర్కొన్నారు.
మూడు రోజుల కిందటే ఈ సత్రంకు సంబంధించిన దాదాపు రూ.300 కోట్ల దేవాదాయ భూముల లీజు కోసం ఏర్పాటుచేసిన వేలంపాటను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై అప్పుడే ఉన్నతాధికారుల నుండి నివేదిక కోరామని... నివేదిక అందడంతో అవతవకలకు పాల్పడిన లంగరుఖానా సత్రం ఈవోను, విశాఖపట్నం అసిస్టెంట్ కమీషనర్‌ను సస్పెండ్ చేసినట్లు మంత్రి తెలిపారు.
read more ఏ1 జగన్ తో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి భేటీ... అందుకోసమేనా...: వర్ల రామయ్య
దేవాదాయ భూములను పరిరక్షించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని... ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఎక్కడ తప్పు జరిగినా తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
పారదర్శక పాలనకే వైసిపి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని... దేవాలయాల భూముల విషయంలో ప్రభుత్వం దృష్టికి ఎవరు ఎలాంటి సమాచారం ఇచ్చినా తక్షణమే స్పందిస్తామన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
read more భార్యాపిల్లలు అడుక్కుతింటే జగన్ ఈగో శాంతిస్తుంది...: భూముల లీజు రద్దుపై జేసి