తల్లి ప్రేమ... పది అడుగుల విషసర్పంతో.. వడ్రంగిపిట్ట పోరాటం.. వీడియో వైరల్
వడ్రంగిపిట్ట.. తన గుడ్లను చెట్టు తొర్రలో దాచుకుంది. దానిని చూసిన ఓ పది అడుగుల పాము.. తినడానికి చెట్టు పాకుతూ తొర్ర వద్దకు వచ్చింది. దానిని చూసిన ఆ వడ్రంగిపిట్ట ఆ పాముతో యుద్ధం చేసింది.
ప్రపంచంలో అన్ని ప్రేమల్లో కెల్లా తల్లి ప్రేమ గొప్పది. తల్లి తాను ఎన్ని బాధలైనా భరిస్తుందేమో కానీ.. తన బిడ్డల విషయం లో మాత్రం చిన్న నొప్పి కలిగినా చూస్తూ ఉరుకోదు. అలాంటిది.. తన కళ్ల ముందే తన కన్నబిడ్డలు మరొకరికి ఆహారంగా మారబోతున్నాయంటూ చూస్తూ ఊరుకుంటుందా..? అవతల ఉన్నది తన కన్నా బలవంతుడైనా పోరాడి మరీ బిడ్డలను కాపాడుకుంటుంది. ఓ వడ్రంగి పిట్ట కూడా అలానే చేసింది.
తన కన్నా ఎన్నో రెట్లు బలవంతుడైన ఓ విష సర్పంతో చిన్న వడ్రంగి పిట్ట పోరాడింది. తన గుడ్లను పాము తినకుండా ఉండేందుకు తన శాయశక్తులా యుద్ధం చేసింది. కాగా.. వడ్రంగి పిట్ట తల్లి ప్రేమ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. విచిత్రం ఏమిటంటే.. ఈ ఘటన దాదాపు 10 సంవత్సరాల క్రితం పేరులో చోటుచేసుగా.. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట సంచలనంగా మారడం విశేషం.
Also Read వరుడి తండ్రి.. వధువు తల్లి ప్రేమాయాణం.. మరోసారి లేచిపోయారు..!
వడ్రంగిపిట్ట.. తన గుడ్లను చెట్టు తొర్రలో దాచుకుంది. దానిని చూసిన ఓ పది అడుగుల పాము.. తినడానికి చెట్టు పాకుతూ తొర్ర వద్దకు వచ్చింది. దానిని చూసిన ఆ వడ్రంగిపిట్ట ఆ పాముతో యుద్ధం చేసింది.
ఆహారం కోసం వడ్రంగిపిట్ట బయటకు వెళ్లి వచ్చే సరికి.. తన చెట్టు తొర్రలోకి విష సర్పం దూరేసింది. ఎక్కడ ఆ పాము తన గుడ్లను తినేస్తుందో అనే భయంతో.. తొర్రలోకి దూరిన పాముని బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నంచేసింది.
పాము బుసలు కొడుతూ విసిరి కొట్టిన ప్రతిసారి ఆ చిన్న వడ్రంగి పిట్ట కిందపడిపోయింది. అయినా మళ్లీ లేచి మరీ ఆ పాముతో ఘర్షణకు దిగింది. ఆ వీడియో చూస్తే.. ఈ సృష్టిలో నిజంగా తల్లి ప్రేమ చాలా గొప్పది అని ఎవరైనా అంగీకరించాల్సిందే. కాగా.. నెటిజన్లు ఈ వీడియోకి తెగ స్పందిస్తున్నారు. ఇది చాలా అమేజింగ్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ఆ వీడియో చూస్తే.. చాలా భయం వేసిందని.. తన కళ్ల వెంట కన్నీరు ఆగలేదు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే.. మరో బాధాకర విషయం ఏమిటంటే.. ఆ పాము కాటుకి బలై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.