వార్నీ.. ఆ ఐదు రోజులు మహిళల ఒంటిమీద నూలుపోగు ఉండదట.. ఎక్కడంటే...

ఓ గ్రామంలోని వింత ఆచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. గ్రామంలోని మహిళలు 5 రోజుల పాటు దుస్తులు లేకుండా ఉంటారట. 

Women Do Not Wear Clothes For 5 Days In Himachal Pradesh Pini Village - bsb

హిమాచల్ ప్రదేశ్ : కొన్ని ఆచార వ్యవహారాలు విన్నప్పుడు వింతగా అనిపిస్తాయి.  మూఢనమ్మకాలుగా తోస్తాయి.  అవి పాటించేవారు మాత్రం వాటిని తమ సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా చూస్తారు.. నిష్టగా పాటిస్తారు.  ఇలాంటి భిన్నమైన ఆచార వ్యవహారాలు మన దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి మరింత వింతైన.. వినగానే వార్నీ ఇదెక్కడి గోల అనిపించేలాంటి ఆచారం ఉంది. అదేంటంటే.. ఓ గ్రామంలో మహిళలు సంవత్సరంలో ఓ ఐదు రోజులపాటు ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా ఉంటారట.

ఇదేం విచిత్రంరా బాబోయ్.. అలా ఎలా కుదురుతుంది…ఒంటినిండా తల నుంచి అరికాలి వరకు బట్టలు ధరిస్తేనే వేధింపులు తట్టుకోలేకపోతున్నారు…ఇక బట్టలు వేసుకోకపోతే వారిని బతకనిస్తారా అనుకుంటున్నారు కదా... అయితే, ఈ సమయంలో.. వారు పాటించే ఆచార వ్యవహారాలు తెలుసుకుంటే ఇలాంటి అనుమానాలు మీకు రావు. ఈ ఆచారం హిమాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో స్థానికులు నిష్టగా పాటిస్తారట.

పరువు హత్య: ప్రేమికులను హత్య చేసి, శవాలకు రాళ్లుకట్టి.. మొసళ్లున్ననదిలో పడేశారు

వారు ఇలా ఈ ఆచారాన్ని పాటించడం వెనక ఒక ముఖ్యమైన కారణం కూడా ఉందట. హిమాచల్ ప్రదేశ్ లోని మణికర్ణ లోయలోని పిని అనే గ్రామంలో శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది.  సంవత్సరంలో ఐదు రోజులు ఆ గ్రామంలోని మహిళలు ఎవరు దుస్తులు ధరించరు. ఇక.. ఈ సంప్రదాయాన్ని ఆచరించే ఐదు రోజులు పిని గ్రామానికి బయట వ్యక్తులు ఎవరూ రాలేరు. 

ఈ ఆచారాన్ని పాటించే ఐదు రోజులు.. మహిళలు ఇంటి దగ్గరే ఉంటారు. బయటకు రారు. ఈ ఆచారాన్ని నియమ నిష్ఠలతో కొనసాగిస్తారు. స్త్రీలు ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా ఉండే ఈ ఐదు రోజులు..  పురుషులు కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఐదు రోజులపాటు పురుషులు మద్యం తాగకూడదు,  నాన్ వెజ్ తినకూడదు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు.

ఈ ఆచారాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. ఒకవేళ ఇది పాటించకపోయినట్లయితే సదరు మహిళకు చెడు జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. ఇక ఈ ఆచారం కొనసాగుతున్న సమయంలో భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకోవడం నిషేధం. పురుషులు కూడా ఈ సంప్రదాయాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

దీని వెనక ఓ విచిత్రమైన కథ ప్రచారంలో ఉంది..  శతాబ్దాల క్రితం తమ గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించారట. ఆ సమయంలో రాక్షసులు గ్రామంలోని వివాహిత స్త్రీలకు అందమైన దుస్తులు వేసి ఎత్తుకెళ్లే వారట. అప్పుడు లహువా ఘోండ్ అనే దేవతకు మొర పెట్టుకోగా.. ఆమె ప్రత్యక్షమై రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడించిందట. వారు చెరపట్టిన మహిళలను విడిపించిందట. అందుకే అప్పటినుంచి.. సంవత్సరంలో 5 రోజులు బట్టలు లేకుండా ఉండడం ఆచారంగా మారిందని గ్రామపెద్దలు చెబుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios