పండ్ల బండి తన కారుకి తగిలిందని.. ఓ మహిళ వీరంగం.. వీడియో వైరల్..!
అయోధ్య నగర్ లో నాలుగు రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మహిళ.. నడి రోడ్డుపై వీరంగం సృష్టించింది.
పొరపాటున ఓ పండ్ల వ్యాపారి.. తన బండిని ఓ కారుకు తగిలించాడు. అంతే.. ఆ కారులోని కిందకు దిగి ఓ మహిళ వీరంగం సృష్టించింది. పండ్ల వ్యాపారిపై విరుచుకుపడింది. ఆ పండ్ల వ్యాపారి అమ్ముతున్న బొప్పాయి పండ్లు మొత్తం ఒకదాని తర్వాత మరొకటి నేలకేసి కొట్టింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ లోని అయోధ్య నగర్ లో నాలుగు రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మహిళ.. నడి రోడ్డుపై వీరంగం సృష్టించింది.
పండ్ల వ్యాపారి కారణంగా... తన కారుకు డ్యామేజ్ అయ్యిందని ఆమె ఇలా చేయడం గమనార్హం. బండి మీద పండ్లు అన్నింటినీ గట్టిగా.. రోడ్డుపై విసిరికొట్టింది. అటుగా వెళ్తున్న కొందరు.. ఆమె చేస్తున్న పనిని ప్రశ్నించగా.. తన కారు డ్యామేజ్ చేశాడని.. తాను నష్టపోయానని.. ప్రతీకారంగా ఇలా చేస్తున్నానని చెప్పడం గమనార్హం.
కాగా.. తన పండ్లు నాశనం చేయవద్దని సదరు పండ్ల వ్యాపారి ఆమెను ఎంత వేడుకున్నా.. ఆమె మాత్రం ఆగలేదు. పండ్లను రోడ్డు మీద విసిరికొడుతూనే ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ చిరు వ్యాపారిని ఆమె ఇలా ఇబ్బంది పెట్టడంపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.