ఇదేందయ్యా ఇడ్డూరం.. పిజ్జా వండుకుని తినడానికి.. అగ్నిపర్వతంపైకి వెళ్ళిన మహిళ..
Viral Video: గ్వాటెమాల సందర్శించేందుకు వెళ్లిన ఓ మహిళ ఓ అపూర్వ అనుభవాన్ని పంచుకుంది. అగ్నిపర్వతంపై వండిన పిజ్జా తింటున్న వీడియోను మహిళ షేర్ చేసింది. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
Viral Video: విహారయాత్రం చేయడమంటే చాలామంది ఇష్టపడుతున్నారు. దేశ, విదేశాలను పర్యటిస్తుంటారు. అలాగే.. అక్కడి ఆహారపదార్ధాలను రుచి చూస్తారు. ఇటీవల సోషల్ మీడియా హవా నడుస్తోంది. కాబట్టి .. చాలా మంది తన అభిరుచులను, అనుభవాలను, అభిప్రాయాలను నెట్టింట్లో పంచుకుంటున్నారు. అందుకు సంబంధించిన పలు చిత్రాలను, వీడియోలను షేర్ చేస్తుంటారు.
అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే మహిళకు కూడా విహారయాత్రలంటే.. చాలా ఇష్టమంట.. తాను అనుకున్నది ఎలాంటి ప్రదేశమైనా వెళ్లడానికి అసలు వెనకాడదంట. అయితే.. ఇటీవల తనకు గ్వాటెమాలాకు వెళ్లి అక్కడ ఒక ప్రత్యేకమైన పిజ్జాను వండుకోవాలని అనిపించిందంట. అందులో ఆశ్చర్యమేముందని అనుకుంటున్నారు. గ్వాటెమాలా అనేది సాధారణమైనా ప్రాంతం కాదు. అదో చురుకైన అగ్నిపర్వతం. ఆ చురుకైన అగ్నిపర్వతంపై పిజ్జా వండుకుని తినాలనిపించంట. ఇంకేముందు.. ఫిక్నిక్ వెళ్లినట్టు, వనభోజనలకు వెళ్లినట్టు వెళ్లింది.
ఆమె అగ్నిపర్వతంపై పిజ్జాను కుక్ చేసి.. ఎంజాయ్ చేస్తూ.. తినేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (alexandrablodgett) ఆమె స్వయంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది.
‘అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తినడానికి గ్వాటెమాలకు వెళ్తున్నాను. కేవలం ఇదే పనిపై ఇక్కడికి రాలేదు..ఇక్కడి ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడటానికి కూడా. ఈ అగ్నిపర్వతం 2021లో పేలింది. ఇంకా ఈ అగ్ని పర్వతం యాక్టివ్‍గానే ఉంది. ఈ నేషనల్ పార్క్ లోనికి వెళ్లాలంటే తప్పనిసరిగా గైడ్ ఉండాలి. మేము పిజ్జా తయారు చేయడం కోసం ముందుగానే బుక్ చేసుకున్నాము. ఇక్కడ చలి ఎక్కువగా ఉంది. చల్లటి గాలులు వీస్తాయి’ అని అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ తన వీడియోను షేర్ చేసింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రారంభంలో.. ఒక వ్యక్తి పచ్చి పిజ్జాను నేలపై ఉంచి కవర్ చేస్తున్నట్లు చూపబడింది. కాసేపయ్యాక దాన్ని తీసి సర్వ్ చేస్తాడు. మిగిలిన వీడియోలో.. అలెగ్జాండ్రా ఈ ప్రత్యేకమైన పద్ధతిలో వండిన పిజ్జాను ఆస్వాదిస్తూ కనిపించింది.
ABC యొక్క నివేదిక ప్రకారం.. గ్వాటెమాలలోని శాన్ విసెంటే పకాయా అనే నగరం అగ్నిపర్వతం లోపల పిజ్జా వండుకునే ఏకైక ప్రదేశం. పిజ్జా పకాయాగా పిలిచే ఈ రెస్టారెంట్‌ను డేవిడ్ గార్సియా ప్రారంభించారు. కొంతమంది పర్యాటకులు అగ్నిపర్వత గుహలలో మార్ష్‌మాల్లోలను కాల్చడం చూసిన తర్వాత అతనికి ఈ వ్యాపారం గురించి ఆలోచన వచ్చింది. జూలై 2న ఈ వీడియో పోస్ట్ చేయబడింది. షేర్ చేయబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ క్లిప్ ను ఒక మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. చాలా మంది నెట్టిజన్లు వీడియోను లైక్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.