ఆటోలో ఇయర్ పాడ్స్ మర్చిపోయింది.. కానీ అరగంటలో అవి ఆమె దగ్గరికి చేరాయి.. ఎలాగో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు..
ఓ ఆటో డ్రైవర్ టెక్నాలజీ సాయంతో.. తన ఆటోలో ఓ కస్టమర్ మర్చిపోయిన ఇయర్ పాడ్ ను ఆమెకు చేర్చాడు.
బెంగళూరు : బెంగళూరు టెక్ సిటీ అన్న విషయం తెలిసిందే. అయితే అక్కడి సామాన్యుడు కూడా టెక్నాలజీని వాడడంలో ఏంతో ముందున్నాడనే విషయాన్ని తెలిపే ఓ ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇప్పుడా పోస్టుకు వేలల్లో లైక్ లు, కామెంట్లు వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే...
బెంగళూరుకు చెందిన ఓ టెకీ షిడికా. తను వర్క్ కు వెళ్లడానికి ఆటోను బుక్ చేసుకుంది. అయితే దిగేముందు తన ఇయర్ పాడ్స్ ను ఆటోలో మర్చిపోయింది. అవి ఖరీధైన ఇయర్ పాడ్స్.. ఇవ వాటి మీద ఆశ వదులుకోవాల్సిందే అంటారా? నిజానికి అలాగే జరగాలి.. అన్నిచోట్ల దాదాపు 99శాతం అలాగే జరుగుతుంది. కానీ.. ఆ ఇయర్ పాడ్స్ అరగంటలో ఆమెకు చేరాయి. ఆ చేరిన విధానం ఆమెను ఆశ్చర్యపరిచింది.
దీనిమీద ఓ పోస్ట్ రాసి ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అదిప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమెకు ఆ ఖరీదైన గ్యాడ్జెట్ తిరిగి ఎలా లభించిందంటే.. ఆమెను ఆమె వర్కప్లేస్ అయిన వివర్క్ దగ్గర డ్రాప్ చేశాడు. తరువాతెప్పుడో ఆటోలో అతనికి ఇయర్ పాడ్స్ కనిపించాయి. అవి ఎవరివో తెలియవు. అంత ఖరీధైనవి తిరిగి యజమానులకు అప్పగించాలనుకున్నాడు. వెంటనే అవి ఎవరివో తెలుసుకోవడానికి వాటిని తన ఫోన్ కు కనెక్ట్ చేశాడు.
అందులో డిటైల్స్ తీసుకుని.. తన ఆటోలో ఎవరెవరు ఎక్కాడు.. అని ఫోన్ పే లో సెర్చ్ చేసి.. అసలైన యజమానికి పట్టుకు్నాడు. ఆ తరువాత ఆమె ఆఫీస్ దగ్గరికి వచ్చి.. అరగంట తరువాత అక్కడి సెక్యూరటీకి వాటిని ఇచ్చేసి వెళ్లాడు. ఇది తెలుసుకున్న ఆమె ఆశ్చర్యపోయింది. దీన్ని మొత్తాన్ని ట్విట్టర్ లో రాసి పెట్టింది.
అది చదివిన నెటిజన్లు ఆటో డ్రైవర్ టెక్ సావీ అవ్వడం.. టెక్నాలజీని వాడి.. పోయిన వస్తువును యజమాని దగ్గరికి చేర్చడం తెలిసి ఆశ్చర్యపోయారు. ఇలాంటి వాళ్ల వల్లే మానవత్వం ఇంకా బతికి ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్ ఇప్పటికే 8 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.