ఓ మహిళ విమానంలో ప్రసవించింది. దీంతో.. ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి.. తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే... థాయిలాండ్‌కు చెందిన ఓ 23 ఏళ్ల మహిళ విమానంలోనే ప్రసవించింది. ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం దోహ నుంచి బ్యాంకాక్‌కు బయల్దేరింది. అయితే ఈ విమానంలో నిండు గర్భిణి ఉంది. విమానంలో ప్రయాణిస్తుండగానే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. 

Also Read 182 మంది స్త్రీలతో సంబంధం.. రహస్యంగా వీడియోలు తీసి...

దీంతో ఆ విమానాన్ని ఆకస్మికంగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ చేశారు. సోమవారం ఉదయం 3:15 గంటలకు థాయి మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది తెలిపారు. 

తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని.. వారిని చికిత్స నిమిత్తం కోల్‌కతాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌ నెలలో కూడా ఫ్లోరిడాకు చెందిన మహిళ జెట్‌వే విమానంలో ప్రసవించడం గమనార్హం. కాగా... ఈ న్యూస్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.