Asianet News TeluguAsianet News Telugu

ఫైవ్ స్టార్ హోటళ్లో నీళ్లు అడిగిన మహిళకు చేదు అనుభవం.. వీర్యం కలిపి ఇచ్చిన సిబ్బంది...

హోటల్ లో నీళ్లు అడిగిన మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. వారికి ఇచ్చిన నీళ్ల బాటిళ్లలో వీర్యం కలిపి ఇచ్చాడో ఉద్యోగి. దీంతో ఆ మహిళ కోర్టుకెక్కింది. 

woman claims ritz-carlton employee mixed semen in water, us - bsb
Author
First Published Nov 1, 2023, 12:33 PM IST

అమెరికా : కాలిఫోర్నియాలో ఓ హోటల్ కి వెళ్లిన మహిళకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ఇప్పుడు దానికి సంబంధించిన వార్త వైరల్ గా మారుతుంది. కొన్నిసార్లు హోటల్ సిబ్బంది ఎలా వ్యవహరిస్తారో ఊహించలేం. అలాంటి ప్రవర్తనే ఎదురయ్యింది ఓ మహిళకి. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాలోని రిడ్జ్ కార్ల్టన్ హోటల్లో  ఓ మహిళ బస చేసింది. అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ఆ మహిళకు  ఇచ్చిన నీటిలో వీర్యం కలిపాడు అక్కడ పనిచేసే సిబ్బంది. ఆ నీటిని తాగిన మహిళ రుచి తేడాగా అనిపించడంతో అనుమానించింది.

వెంటనే ఆ నీటిని పరీక్షించాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ నీటిని ల్యాబ్ లో పరీక్షించగా అందులో వీర్యం కలిసినట్లుగా తేలింది. ఆ రిపోర్టు విని షాక్ అయిన సదరు మహిళ, ఆమె భర్త.. హోటల్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని  పేర్కొంది.

జార్జ్ సోరోస్‌ మానవత్వాన్ని ద్వేషిస్తారు.. సమాజాన్ని నాశనం చేసే పనులు చేస్తారు: మస్క్ సంచలనం

రిడ్జ్ కార్ల్టన్ హోటల్లో తమ కూతురు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని జేన్, జాన్ డో అనే దంపతులు వెళ్లారు. అక్కడ వారికి ఫైవ్ స్టార్ హోటల్ పద్ధతిలో స్వాగతం లభించింది. ఆ తర్వాత హోటల్ ఫ్రంట్ డెస్క్ నుంచి ఆమె ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ చేసింది. వారి ఆర్డర్ ప్రకారం ఒక ఉద్యోగి ఐదు వాటర్ బాటిల్స్ ని వారి గదిలోకి తెచ్చి ఇచ్చాడు. తర్వాత వారంతా నిద్రపోయారు. 

అర్ధరాత్రి లేచిన మహిళ దాహం వేయడంతో… ఆ హోటల్ సిబ్బంది తెచ్చిన బాటిల్ లోని నీటిని తాగింది. అయితే, ఆ నీరు ఏంటో తేడాగా అనిపించడంతో భర్తను నిద్ర లేపి విషయం తెలిపింది. వెంటనే అలర్ట్ అయిన భర్త విషయాన్ని హోటల్ యాజమాన్యానికి తెలిపాడు. ఆ  తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు.

వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ నీటిని టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపారు. ఆ పరీక్షల్లో ఆ నీటిలో వీర్యం కలిసిందని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. ఇంత దారుణానికి పాల్పడిన హోటల్ ఉద్యోగిపై ఇంకా చర్యలు తీసుకోలేదని ఆ మహిళ తరపు న్యాయవాది తెలిపారు. వెంటనే నిందితుడికి శిక్ష పడకపోతే ఇలాంటి పనులు ఇంకిన్ని చేస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios