సారాంశం

పాము తన ఒంటిపై పాకుతున్నా కూడా... హ్యాపీ గా చిల్ అవుతూ ఏ మాత్రం కదలకుండా పడుకునే ఉంది.

అంత దూరంలో పాము కనపడితేనే భయంతో వణికిపోతాం. లేదంటే అక్కడి నుంచి పరుగులు తీస్తాం. అలాంటిది.. పాము మన దగ్గరకు వచ్చి.. మన ఒంటిపై పాకితే ఇంకేమైనా ఉందా...  ఆ ఆలోచన వస్తేనే.. గుండె ఆగినంత పని అయిపోతుంది కొందరికైతే. కానీ ఓ మహిళ మాత్రం... పాము తన ఒంటిపై పాకుతున్నా కూడా... హ్యాపీ గా చిల్ అవుతూ ఏ మాత్రం కదలకుండా పడుకునే ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఎక్కడ జరిగింది అనే విషయంపై క్లారిటీ లేదు కానీ... వీడియో మాత్రం వైరల్ గా మారింది.

ఐఎస్ఎస్ అధికారి సుసంతా నందా ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో మహిళ.. మంచంపై బోర్లా పడుకొని ఉంది. ఆమెపై ఓ తాచుపాము పడుకొని ఉంది. పాము తనపై పడుకుందని కాస్త కూడా కంగారు లేకుండా హాయిగా పడుకొని ఉంది.  కొద్ది సేపటి తర్వాత.. ఆ పాము.. ఆమె మీద నుంచి ఆమెను ఏమీ చేయకుండా వెళ్లిపోయిందట.

 

ఈ వీడియోని చూసి నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు. ఆమె ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా మంది అలాంటి పరిస్థితుల్లో తాము  ఉంటే మాత్రం అంత ధైర్యంగా ఉండేవారం కాదు అని కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. చాలా మంది తాము గుండె ఆగి చచ్చేవాళ్లం అంటూ కామెంట్ చేయడం గమనార్హం.