Asianet News TeluguAsianet News Telugu

మన కొడుకు నీకు పుట్టలేదు.. చనిపోయేముందు భర్తకు షాకింగ్ లెటర్ రాసిన భార్య.. అతనేం చేశాడంటే...

చనిపోయేముందు ఓ భార్య భర్తకు రాసిన లెటర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. తమకు పుట్టినట్టుగా భావిస్తున్న తమ కొడుకు అతనికి పుట్టకపోయి ఉండొచ్చని తెలిపింది. 

wife wrote a shocking letter to her husband before she died, goes viral - bsb
Author
First Published Sep 30, 2023, 9:28 AM IST

ఓ వ్యక్తికి పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులకే భార్య చనిపోయింది. నాలుగేళ్ల పిల్లాడిని భర్తకు వదిలి తిరిగిరానిలోకాలకు వెళ్ళిపోయింది.  అయితే, చనిపోయే ముందు భర్తకు రాసిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు నిండు జీవితాలను నాశనం చేసేలా ఉన్న ఆ లెటర్ ఆమె ఎందుకు రాయాల్సి వచ్చింది.. అని నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు భర్త ఆ లేఖను భార్య చనిపోయిన 10 నెలల తర్వాత చదివాడు .ఇంతకీ ఆమె ఆ లేఖలో ఏం రాసిందంటే.. తనకు పుట్టిన కొడుకుగా భావిస్తున్న చిన్నారి అతనికి పుట్టకపోయి ఉండొచ్చు..  అని భరించలేని నిజాన్ని తెలిపింది.

దీంతో షాక్ కు గురైన ఆ భర్త డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలో, లేదో తెలియక మదనపడ్డాడు. మరోవైపు  అల్లారుముద్దుగా చూసుకుంటున్న చిన్నారి తనకు పుట్టలేదన్న వాస్తవాన్ని అంగీకరించడానికి అతని మనసు ఒప్పుకోలేదు. భార్య తనను మోసం చేసిందన్న విషయాన్ని  తట్టుకోలేకపోయాడు. ఆ లేఖలో దీనికి కారణంగా ఆమె చెబుతూ పెళ్లికి ముందు జరిగిన బ్యాచిలర్స్ పార్టీలో అనుకోకుండా ఓ వ్యక్తితో ఆమె శృంగారంలో పాల్గొన్నట్లుగా చెప్పుకొచ్చింది.

బలూచిస్తాన్ లో ఈద్ మిలాదున్ నబీ ర్యాలీలో ఆత్మాహుతి బాంబు దాడి.. 31మంది మృతి...

ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయిందని తెలిపింది. దీంతో తమ కొడుకుగా భావిస్తున్న బాబు అతనికి పుట్టి ఉండకపోవచ్చు అని అనుమానాలు వ్యక్తం చేసింది. చివరికి కొద్దిరోజుల డైలమా తర్వాత అతను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోగా భార్య చెప్పింది వాస్తవమే అని తేలింది. ఆ చిన్నారి తనకు పుట్టలేదని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ రెడిట్ లో పోస్ట్ చేశాడు.

అందులో అతను ఇలా రాశాడు.. ‘నా ప్రియమైన భార్య 10 నెలల క్రితం అనుకోకుండా మృత్యువాత పడింది. చనిపోవడానికి కొద్ది రోజుల క్రితం నాకు ఉత్తరం రాసింది. దీనికి కారణం ఆ విషయాన్ని నాతో నేరుగా చెప్పేందుకు ఆమెకు ధైర్యం సరిపోకపోవడమే. ఆమె చనిపోయే సమయానికి మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ చిన్నారి నాకు పుట్టకపోయి ఉండవచ్చని ఆ ఉత్తరంలో ఆమె చెప్పింది. నాతో పెళ్లికి ముందు జరిగిన ఓ బాస్టర్ పార్టీలో ఆమె వేరే వ్యక్తితో సెక్స్ చేసినట్లు తెలిపింది. ఆ తరువాత తాను ప్రెగ్నెంట్ అయ్యానని లేఖలో రాసింది’.

ఉత్తరాన్ని నేను ఆ సమయంలో చదవడం మర్చిపోయాను.  ఆమె మృతి చెందిన తర్వాత పది నెలలకి గుర్తొచ్చి ఉత్తరం చదివితే ఈ షాకింగ్ విషయం తెలిసింది. ఇప్పుడు నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా, వద్దా అని ఎంతగానో ఆలోచించాను. చివరికి చేయించుకున్నాను. ఆ బాబు నాకు పుట్టలేదని తెలిసింది. చనిపోయే ముందు ఇంత దారుణంగా నన్ను బాధించాలని ఆమె ఎందుకు అనుకుందో తెలియదు. 

బాబు నాకు పుట్టకపోయినా నా కొడుకు మీద ఉన్న ప్రేమ  తగ్గదు.  ఆ చిన్నారిపై నాకు కోపం లేదు. ఇవన్నీ నా తలలో ఇప్పుడుఎన్నో రకాలుగా తిరుగుతున్నాయి. నాకు ఏడుపు ఆగడం లేదు’ అంటూ  ఆ పోస్టులో పేర్కొన్నాడు. ఇది చదివిన చాలామంది నెటిజెన్లు అతడికి మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. కుర్రాడి మీద తండ్రి చూపిస్తున్న ప్రేమకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ చిన్నారి మీద సానుభూతి  చూపించాలని.. అన్యాయం చేయొద్దని కామెంట్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios