సారాంశం

కోల్‌కతాలో భారత్ 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 49వ వన్డే సెంచరీ చేసి సచిన్ రికార్డును సమం చేశాడు. 
 

ఉత్తర్ ప్రదేశ్  : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ 49వ సెంచరీ చేసి రికార్డు సాధించిన నేపథ్యంలో ఓ అద్భుతమైన ఘటన వెలుగు చూసింది. దక్షిణాఫ్రికా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023పై భారత్ విజయం సాధించిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ కొత్త జంట.. తమ వివాహాన్ని ప్రత్యేకంగా మార్చుకున్నారు. 

కోహ్లీ సెంచరీ పూర్తి చేయగానే.. వధూవరులు వారి బంధువులతో కలిసి విరాట్ కోహ్లీ ఫొటోలను చేతుల్లో పట్టుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనిమీద వరుడు మాట్లాడుతూ.. ‘ఈరోజు నా పెళ్లి కావడం, ఈరోజు భారత్ కూడా గెలిచి సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేయడంతో నాకు ‘డబుల్ ధమాకా’ లాగా అనిపిస్తుంది అని ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు.

వధువు మాట్లాడుతూ..  "ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటాం" అని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో తమ విజయ పరంపరను భారత్ కొనసాగిస్తోంది. వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది. ఆదివారం కోల్‌కతాలో జరిగిన మ్యాచ్ లో భారత్ 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.