Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి పరోటా... పదిమంది తిన్నా తరగదేమో..!

దానిని చేసే విధానం నెట్టింట షేర్ చేయగా... వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిని రాజస్థాన్ లోని జైపూర్ కి చెందిన ఓ వ్యక్తి తయారు చేశాడు.

Viral Video: This Giant Paratha From Jaipur Weighs A Whopping 5 Kilos ram
Author
First Published Mar 29, 2023, 10:12 AM IST

మీరు ఇప్పటి వరకు బాహుబలి తాలి, బాహుబలి బిర్యానీ, బాహుబలి సమోసా ఇలా రకరకాల పేర్లు విని ఉంటారు. కానీ.... బాహుబలి పరోటా గురించి విన్నారా..? అవును... ఓ వ్యక్తి బాహుబలి పరోటా తయారు చేసి.. నెట్టింట వైరల్ గా మారాడు.  చాలా మంది పరోటా,రోటీలు తినడానికి చాలా ఎక్కువ ఇష్టం చూపిస్తారు. అలాంటివారిని ఆకట్టుకునేందుకు ఓ వ్యక్తి ప్రత్యేకంగా అతిపెద్ద పరోటా తయారు చేశాడు. దానికి బాహుబలి పరోటా అని నామకరణం చేశాడు. దానిని చేసే విధానం నెట్టింట షేర్ చేయగా... వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిని రాజస్థాన్ లోని జైపూర్ కి చెందిన ఓ వ్యక్తి తయారు చేశాడు.

ఈ వీడియోని ఫుడీ ఇన్ కార్నెట్ అనే ఓ సోషల్ మీడీయా ఎకౌంట్ లో షేర్ చేశారు. ఈ పేజీని అమర్ సిరోహి అనే ఫుడ్ బ్లాగర్  ఈ వీడియోని తన పేజీలో షేర్ చేశాడు. భారతదేశంలోని అతిపెద్ద పరోటా అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ పరోటాని 32 అంగుళాలు తయారు చేశారు. దీని ధర రూ.819 కావడం విశేషం.

 

ఈ పరోటా తయారు  చేయడానికి కేజీ బంగాళదుంపలు, పనీర్, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, పచ్చి కొత్తిమీర, మసాలా దినిసులు మొత్తం కలిసి రెండు కేజీల మిశ్రమాన్ని తయారు చేశారు. ఆ తర్వాత మూడున్నర కేజీల గోధుమ పిండితో చపాతి పిండి లా కలిపారు. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కలిపి పరాటాలా వత్తారు. 40 కిలోల బరువున్న భారీ తవా సహాయంతో పరోటా కాల్చబడింది. పరాటాపై నూనె, అమూల్ వెన్న మిశ్రమాన్ని ఉపయోగించారు. ఈ పరోటా తయారీ విధానం చూసినా నోరూరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios