కుక్కలు దొంగలను పట్టుకుంటాయి.. యజమాని పట్ల విశ్వాసం చూపిస్తాయి. ఈ విషయం మనకు తెలిసిందే. అంతెందుకు కుక్కలు ఈత కొట్టడం కూడా చూసే ఉంటారు. కానీ.. ఎప్పుడైనా కుక్క పాట పాడటం విన్నారా.. కుక్క పాట పాడటం ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ నిజం. ఓ కుక్క పాట పాడింది.

మామూలుగా పాడటం కూడా కాదు.. ఏకంగా తన యజమానితో పోటీపడి మరీ పాట పాడింది. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా.. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

ముంబయికి చెందిన ఈ వ్యక్తి పేరు రోహిత్. అతను తన కుక్కతో కలిసి పాట పాడాడు. ఆ వీడియోని ఫేస్ బుక్ లో షేర్ చేయగా.. వీడియో కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియోలో రోహిత్.. సంగీతం తీస్తుంటే.. అచ్చం అదేవిధంగా కుక్క కూడా పాడటం గమనార్హం. అచ్చం రోహిత్ ని ఇమిటేట్ చేస్తూ సౌండ్ చేసింది. దీంతో.. కుక్క చేసిన ఈ ఫన్నీ థింగ్.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.