గద్దలు.. ఆకాశంలో ఎగురుతూనే.. వాటికి కావాల్సిన ఆహారాన్ని భూమి మీద వెతుక్కుటాయి. చిన్న చిన్న కోడిపిల్లలు..నీటిలోని చిన్న చేప పిల్లలను ఎత్తుకెళ్లి.. దూరంగా తీసుకువెళ్లి తినేస్తాయి. అయితే.. తాజాగా ఓ గద్దకు ఏకంగా సొర చేప దొరికేసింది. 

దానిని కాళ్లతో పట్టుకొని ఆకాశానికి ఎగిరింది. దీనిని ఓ మహిళ తన కెమేరాలో బంధించింది. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో... ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సౌత్ కాలిఫోర్నియాలోని మైర్టైల్ బీచ్‌లో ఉన్న ఓ భవనంలో యాష్లీ వైట్ అనే మహిళ నివసిస్తోంది. 17వ అంతస్తులోని ఆమె గది బాల్కనీలోనుంచి బీచ్ గాలిని ఆస్వాదిస్తుండగా.. ఆమె కళ్లకు ఓ అద్భుతం కనపడింది. 

 

ఓ గద్దను చేపను ఎత్తుకెళుతోంది. ఇది చాలా కామన్ విషయమై.. అయితే... అది ఎత్తుకెళ్లేది మామూలు చేపను కాదు. సొర చేపను తీసుకువెళుతోంది. దీంతో షాక్‌కు గురైన ఆమె వెంటనే తన ఫోన్‌లో ఆ దృశ్యాన్ని చిత్రీకరిచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ఆమె పోస్టులోని వీడియోని అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్‌మన్ కూడా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయిపోయింది. కొన్ని గంటల్లోనే 14.4 మిలియన్ల(1కోటి 44 లక్షల) మంది ఈ వీడియోను చూశారు. 25 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో షార్క్ చేపను పట్టుకున్న గద్ద గాలిలో చక్కర్లు కొట్టడం, దాని పట్టునుంచి విడిపించుకునేందుకు సోరచేప గింజుకోవడం.. అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.