Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో : భారీ పాముల పక్కనే గోల్ఫ్ ఆడుతున్న వ్యక్తి..

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో తీసిన ఓ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి రెండు భారీ పాముల పక్కన గోల్ఫ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. 

Viral video : Man playing golf next to huge snakes in Australia - bsb
Author
First Published Dec 18, 2023, 1:15 PM IST

ఆస్ట్రేలియా : బెత్తెడు పాము పిల్ల కనిపిస్తేనే కాళ్లలో వణుకుపుడుతుంది. దాన్ని తరమడమో, చంపడమో చేసేదాకా గజగజలాడిపోతాం. అలాంటిది.. మనిషెత్తు పాములు పక్కనే ఆడుకుంటున్నా.. ఏమాత్రం తొణకకుండా..నింపాదిగా గోల్ఫ్ ఆడుకుంటున్నాడో వ్యక్తి. దీన్ని గమనించిన మరొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది బాబుగారి ధైర్యాన్ని నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. దీంతో వీడియో వైరల్ గా మారిపోయింది. 

బ్రిస్బేన్ గోల్ఫ్ కోర్స్‌లో ఒక గోల్ఫ్ ఆటగాడు గోల్ప్ ఆడుతున్నాడు. వింతేముంది అనుకోకండి.. అతని పక్కనే రెండు బారెడు పాములు.. ఒకదానికొకటి పెనవేసుకుని విన్యాసాలు చేస్తున్నాయి. అదేం పట్టనట్టుగా.. పక్కనే ఏమీ లేనట్టుగా అతను ప్రశాంతంగా తన ఆట ఆడుకుంటున్నాడు. అతనికి కేవలం మీటర్ల దూరంలో అపాయం పొంచి ఉన్నా పట్టించుకోలేదు. 

మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు..

ఇన్‌స్టాగ్రామ్‌లో యూనిలాడ్ అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. కామెంట్లు, లైక్ లతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ పోస్ట్‌కి 19 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఒకరేమో ఇంత ప్రశాంతంగా గోల్ఫ్ ఆడుతున్న వ్యక్తిని మెచ్చుకోగా.. మరొకరు వీడియో తీసిన వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. 

అయితే, ఈ పాములు కోస్టల్ కార్పెట్ కొండచిలువలుగా గుర్తించారు. అవి పోట్లాడుకుంటున్నాయా.. లేక సంభోగంలో పాల్గొంటున్నాయా? అని తెలుసుకోవడానికే నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపినట్లు కామెంట్లలో తెలుస్తోంది. ఒక ఆడపాము కోసం రెండు మగపాములు కొట్టాడుతున్నాయని ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. 

ఆధిపత్యం కోసం మగపాములు ఇలా కొట్టుకుంటాయని పాముల గురించి బాగా తెలిసిన ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆస్ట్రేలియా 140 జాతులకు పైగా పాములకు నిలయం. అందుకే ఈ సంఘటన పూర్తిగా ఆశ్చర్యం కలిగించదు, ఇలాంటి ఘటనలు వేరేప్రాంతాల్లో కంటే ఆస్ట్రేలియన్లకే ఎక్కువగా ఎదురవుతుంటాయని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios