Asianet News TeluguAsianet News Telugu

మృత్యువు నుంచి రెప్పపాటులో ఎస్కేప్: మామూలు సుడిగాడు కాదు

ఎవరైనా పెద్ద ప్రమాదం నుంచి బతికి బట్టకడితే వాడికి భూమి మీద నూకలు ఉన్నాయని అంటారు. అచ్చం అలాంటి సంఘటనే ఇండోనేషియాలో జరిగింది

viral-video-man-narrow-escape-landslide In Indonesia
Author
Jakarta, First Published Jul 21, 2020, 4:33 PM IST

ఎవరైనా పెద్ద ప్రమాదం నుంచి బతికి బట్టకడితే వాడికి భూమి మీద నూకలు ఉన్నాయని అంటారు. అచ్చం అలాంటి సంఘటనే ఇండోనేషియాలో జరిగింది. ఓ వ్యక్తి రోడ్డు మీద స్కూటర్‌‌పై వెళ్తున్నాడు.

ఇంతలో పక్కనున్న భారీ కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. అయితే అతను జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి స్కూటర్‌ను దారి మళ్లించాడు. అనంతరం క్షణం కూడా ఆలస్యం చేయకుండా దానిని రోడ్డు మీదే వదిలేసి పరిగెత్తాడు.

అంతే ఆ కొండచరియలు స్కూటీని మింగేసినట్లుగా పూర్తిగా మట్టితో కమ్మేశాయి. రెపపపాటులో జరిగిన ఈ ఘటనలో అతను ఏ మాత్రం ఆలస్యం చేసినా అతను ప్రాణాలతో మిగిలేవాడు కాదు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఏప్రిల్ 9న చోటు చేసుకుంది.  అప్పటి నుంచి ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కొన్ని సార్లైతే ఇది గోవాలో జరిగిందని, మరోసారి మేఘాలయాలో జరిగిందంటూ తప్పుడు ప్రచారం జరిగింది.

ఈ వీడియోను చూసిన వారు ఆ వ్యక్తికి భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయని... నిజంగా అదృష్టవంతుడని కామెంట్లు పెడుతున్నారు. ఇది మేఘాలయలో జరిగిందని చెబుతున్న వారిని తప్పుబడుతూ.. ఆ రాష్ట్ర పోలీసులు ఇది ఇండోనేషియాలో జరిగిందని ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios