Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో : వందేళ్ల నాటి వైన్.. తాగితే స్వర్గమేనట..

మీరు వైన్ ప్రియులా? వైన్ ఎంత మగ్గితే అంత బాగుంటుందని ఒప్పుకుంటారా? అలాంటి ఓల్డ్ వైన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ వైరల్ వీడియో మీ కోసమే.. 

Viral video : Hundred years old wine,  If you drink it, it is heaven - bsb
Author
First Published Feb 5, 2024, 12:33 PM IST | Last Updated Feb 5, 2024, 12:33 PM IST

వైన్ వయసు ఎంత ఎక్కువైతే.. అంటే అది ఎంత పాతదైతే దాని రుచి అంత బ్రహ్మాండంగా ఉంటుందని నమ్ముతారు వైన్ ప్రియులు. అలాంటి పాత వైన్ ధర కూడా ఎక్కువే ఉంటుంది. వైన్ నాణ్యతను కూడా దాని వయసును బట్టే నిర్ణయిస్తారు. ఇంటర్నెట్ లో ఇప్పుడు వందేళ్లనాటి వైన్ అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. 

మట్టి గుమ్మి లాంటి దాంట్లో భద్రపరిచిన ఈ వైన్ ను ఓ వ్యక్తి ఓపేన్ చేస్తుండడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ గుమ్మినిండా మగ్గిన వైన్ ఉంటుంది. అనేక పొరలుగా కప్పి భద్రపరిచిన ఈ వైన్ ను చివరికి ఓపెన్ చేసి గంటెతో తీయడంతో వీడియో ముగుస్తుంది. దీనికి క్యాప్షన్ గా ‘వందేళ్లనాటి వైన్ ను తెరుస్తున్నాం’ అని పెట్టారు. 

దీనిమీద నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది వందేళ్ల క్రితం నాటిదని వారికి ఎలా తెలుసు.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలు ఓ వైపు ఉన్నా.. ఈ వీడియో ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి వరకు, వీడియోను 10.6 మిలియన్ల మంది చూశారు, 432వేల  లైక్‌లు, వేలకొద్దీ కామెంట్‌లు వచ్చాయి. 

కామెంట్లలో ఒకరు.. "ఆ వైన్ ఒక సిప్ చేస్తే చాలు ఆ వైన్ ఎవరు తయారు చేసారో వారిని నేరుగా కలుస్తారు’’ అని సెటైర్ వేశారు. మరొకరు "ఆ విషయం బైబిల్ కాలానికి చెందినదిగా కనిపిస్తోంది" అంటే.. ఇంకొకరు.. ఒక "ఒక సిప్ చేస్తే స్వర్గం కనిపిస్తుంది. మరొక సిప్ మిమ్మల్ని నేరుగా స్వర్గానికి తీసుకువెళుతుంది" అని కామెంట్స్ చేస్తున్నారు. 

గాలి చొరబడని కంటైనర్ లో జాగ్రత్తగా సీల్ చేస్తే 100 ఏళ్ల తర్వాత కూడా వైన్ తాగవచ్చని మరో వ్యక్తి చెబుతున్నాడు. మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios