తన ఆహారాన్ని కుక్కలకి పంచి .. బిచ్చగాడి మానవత్వం, వీడియో వైరల్

మానవత్వం.. సృష్టిలో ఈ జీవికి లేని వరం. దానిని భగవంతుడు మనిషికి ఇచ్చాడు. తోటి వ్యక్తిని, ఇతర జీవరాశులను కాపాడుతూ.. జీవనం సాగించాలన్నది మనిషి బాధ్యత. అయితే ప్రస్తుత కాలంతో మనిషి మాత్రం స్వార్థపూరితమైన మనసుతో మానవత్వాన్ని మరిచిపోతున్నాడు.

viral video beggar feeds street dogs his plate

మానవత్వం.. సృష్టిలో ఈ జీవికి లేని వరం. దానిని భగవంతుడు మనిషికి ఇచ్చాడు. తోటి వ్యక్తిని, ఇతర జీవరాశులను కాపాడుతూ.. జీవనం సాగించాలన్నది మనిషి బాధ్యత. అయితే ప్రస్తుత కాలంతో మనిషి మాత్రం స్వార్థపూరితమైన మనసుతో మానవత్వాన్ని మరిచిపోతున్నాడు.

దీనికి కరోనా తోడు కావడంతో మనిషి దిగజారిపోతున్నాడు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం మనిషిలో మానవత్వం, మంచితనం ఇంకా బతికే ఉన్నాయని నిరూపిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తనకున్న దానిలోనే సాయం చేసి దయా గుణాన్ని చాటుకున్నాడు.

ఇంత చేస్తున్న ఆ వ్యక్తి ధనవంతుడేం కాదు.. ఓ బిచ్చగాడు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను  పోస్ట్ చేశారు. 17 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో వృద్ధుడైన ఓ బిచ్చగాడు తింటుండగా.. వీధి కుక్కలు అతని చుట్టూ వచ్చి చేరాయి.

దీంతో తన భోజనం సంగతి పక్కనబెట్టి.. వున్న కొద్దిపాటి ఆహారాన్ని రెండు ప్లేట్లలో వేసి కుక్కలకు తినిపించాడు. హృదయాన్ని బరువెక్కించే ఈ వీడియోకు సుశాంత్.. ‘‘ సంపదలో పేదవాడు.. మనసున్న వ్యక్తిలో ధనవంతుడు’’ అని క్యాప్షన్ పెట్టాడు. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. అంతేగాక ఆ వృద్ధుడు మానవత్వంతో చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios