Asianet News TeluguAsianet News Telugu

మ్యాచ్ మధ్యలో కిందపడ్డట్టు నటించి.. ప్రేయసికి వెరైటీగా ప్రపోజ్ చేసిన సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి..

సారా రియో, జసింతా కమాండే రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ప్రొఫెషనల్ Softball playerలైన ఈ ఇద్దరు ఓ లీగ్ గేమ్ లో ఆడుతుండగా.. సారా రియో స్టాండ్స్ ఉన్న ప్రేయసి జసింతా ముందు వెరైటీగా పెళ్లి ప్రతిపాదనను ఉంచింది. సారా మ్యాచ్ మధ్యలో గాయపడినట్లు నటించడంతో స్టాండ్స్ లో ఉన్న జసింతా మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది.

viral : Aussie woman proposes partner by faking injury during softball match
Author
Hyderabad, First Published Dec 13, 2021, 10:30 AM IST

పెర్త్ : ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సాఫ్ట్ బాల్ టోర్నీ సందర్భంగా ఓ మహిళా క్రీడాకారిణి.. తన ప్రేయసికి వినూత్నంగా ప్రపోజ్ చేసింది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో గాయపడినట్లు నటించి Girlfriend ముందు Marriage Proposal ఉంచింది. పిచ్ పైనే తనను మనువాడాలని కోరి మైదానంలో ఉన్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం Social mediaలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెడితే.. సారా రియో, జసింతా కమాండే రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ప్రొఫెషనల్ Softball playerలైన ఈ ఇద్దరు ఓ లీగ్ గేమ్ లో ఆడుతుండగా.. సారా రియో స్టాండ్స్ ఉన్న ప్రేయసి జసింతా ముందు వెరైటీగా పెళ్లి ప్రతిపాదనను ఉంచింది. సారా మ్యాచ్ మధ్యలో గాయపడినట్లు నటించడంతో స్టాండ్స్ లో ఉన్న జసింతా మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది.

అప్పటివరకు పడిపోయినట్లు నటించిన సారా.. జసింతా రావడంతో మోకాళ్ల మీద నిల్చోని తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఊహించని ఈ పరిణామంతో జసింతా సహా మైదానంలో ఉన్న వారంతా అవాక్కయ్యారు. అనంతరం తేరుకున్న జసింతా ప్రేయసి సారాను హత్తుకోవడంతో మైదానం మొత్తం చప్పట్లతో హోరెత్తింది. కాగా, టోర్నీలోని కీలక మ్యాచ్ కావడంతో సారా తన మిత్రులు, కుటుంబ సభ్యలునందరినీ ఆహ్వానించి మరీ వారందరి సమక్షంలో ఇష్ట సఖి ముందు పెళ్లి ప్రతిపాదనను ఉంచింది. 

IPL 2021: గర్ల్‌ఫ్రెండ్‌కి గ్రౌండ్‌లోనే ప్రపోజ్ చేసిన దీపక్ చాహార్... సీఎస్‌కే బౌలర్ లవ్లీ మూమెంట్...

ఇలాంటి ఘటనే అక్టోబర్ లో జరిగింది. అక్టోబర్ 7న జరిగిన IPL 2021 మ్యాచ్ తరువాత  పేసర్ దీపక్ చాహార్ తన గర్ల్ ఫ్రెండ్ కు స్టేడియంలోనే ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు. ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ‘మ్యాచ్ విన్నర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు పేసర్ దీపక్ చాహార్.  ఫస్టాఫ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన దీపక్ చాహార్, సెకండాఫ్‌లో ఆ రేంజ్‌లో కాకపోయినా మంచి ప్రదర్శనే ఇచ్చాడు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ వీరబాదుడు కారణంగా 4 ఓవర్లలో ఒకే వికెట్ తీసి 48 పరుగులు ఇచ్చాడు దీపక్ చాహార్. 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఊర మాస్ ఇన్నింగ్స్‌లో పంజాబ్ కింగ్స్‌కి అద్భుత విజయాన్ని అందించినా... ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం లాగేశాడు దీపక్ చాహార్.

దీనికి కారణం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం దీపక్ చాహార్ చేసిన పనే. మ్యాచ్ అనంతరం స్టాండ్స్‌లోకి వెళ్లిన దీపక్ చాహార్, అక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ జయ భరద్వాజ్‌కి మోకాళ్ల మీద నిలబడి ప్రపోజ్ చేశాడు. దీపక్ చాహార్ క్యూట్ అండ్ బ్రేవ్ ప్రపోజల్‌కి సంతోషంతో ఉప్పొంగిపోయిన తన గర్ల్‌ఫ్రెండ్... వెంటనే ‘ఎస్’ చెబుతూ... అతన్ని కౌగిలించుకుంది.

క్రికెట్ స్టేడియంలో ప్రపోజ్ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా సరికొత్త లిస్టు క్రియేట్ చేయబోతున్నాడు దీపక్ చాహార్. ఫుట్‌బాల్ మ్యాచుల్లో ఇలాంటి మూమెంట్స్ చాలా కామన్ అయినా క్రికెట్‌లో మాత్రం చాలా అరుదు. గత ఆసీస్ పర్యటనలో ఓ భారత అభిమాని, తన గర్ల్‌ఫ్రెండ్ అయిన ఆస్ట్రేలియా యువతికి ప్రపోజ్ చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించగా... అతన్ని ఫాలో అయి, ట్రెండింగ్‌లో నిలిచాడు దీపక్ చాహార్..

Follow Us:
Download App:
  • android
  • ios