కన్న బిడ్డలు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. ఆ కల నిజమైన రోజున వారి ఆనందానికి అవధులు ఉండవు. తాను కన్న కలను ఓ కూతురు నేరవేర్చడంతో ఓ తండ్రి పుత్రికోత్సాహంతో పొంగిపోయాడు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ నగరానికి రతానా నాగసెప్పం అనే మహిళ డిప్యూటీ ఎస్పీగా నియమితులయ్యారు. కూతరు పోలీసు అధికారిగా ఎంపికవ్వడం పట్ల ఆమె తండ్రి ఆనందానికి అవధులు లేవు. పోలీసు అధికారిక దుస్తుల్లో ఉన్న కూతురిని చూసుకొని ఆయన మురిసిపోయారు.

ఆమె యూనిఫాం పై ఉన్న నక్షత్రాలను చేతితో తడుముతూ పుత్రికోత్సాహానికి గురయ్యాడు. కూతురిని అలా యూనిఫాంలో చూసి ఆయన మురిసిపోతుండగా తీసిని ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఆ ఫోటోలో.. కూతురి ఉన్నతిని చూసి ఆ తండ్రి ఎంత సంబరపడిపోతున్నాడో.. స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ తండ్రీ-కూతుళ్ల ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. కూతురిని చూసి ఆయన గర్వపడుతుండగా.. తండ్రిని చూసి ఆమె ప్రేమగా నవ్వడం విశేషం. అందుకే ప్రతి ఒక్కరికీ ఆ ఫోటో విపరీతంగా నచ్చేస్తోంది.

ఈ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేయగా వైరల్ అయ్యింది. పోస్టు చేసిన కొద్ది సేపటికే 15వేల లైకులు, వేలల్లో షేర్ అవ్వడం విశేషం. బాలీవుడ్ సినీ నటి రవీనా టాండన్ కూడా ఈ ట్వీట్ పై స్పందిండం విశేషం.

 

ప్రౌడ్ ఇండియన్ ఉమన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ తండ్రీ-కూతుళ్ల ఫోటోని రవీనా టాండన్ షేర్ చేశారు. దీంతో ఫోటో మరింత వైరల్ గా మారింది.