వాలెంటైన్స్ డే : ట్విట్టర్ కలిపిన ప్రేమబంధం.. హైద్రాబాదీ జర్నలిస్ట్ క్యూట్ లవ్ స్టోరీ..!
ట్విట్టర్ మెసేజ్ ఓ జంటను ఎలా కలిపిందో..షేర్ చేసింది ఓ మహిళ.. వాలెంటైన్స్ డై సందర్భంగా తాను తన భర్తను కలుసుకున్న మొదటి ఘటన పంచుకున్నారు.
హైదరాబాద్ : ప్రేమ.. ప్రతీ ఒక్కరి జీవితాల్లోనూ అందమైన అనుభవం. అలాంటి అనుభవాన్ని పదిలంగా దాచుకుని.. ప్రేమికుల రోజున తాను, తన భర్త.. అసలెలా కలుసుకున్నామో షేర్ చేసిందో మహిళ... ఇప్పుడా పోస్ట్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
ఇంటర్నెట్ యుగంలో, ప్రతి సోషల్ మీడియా అప్లికేషన్ డేటింగ్ ప్లాట్‌ఫారమే, ఇద్దరు వ్యక్తుల హృదయాలను కలిపి.. ప్రేమానుబంధాలకు దారులు వేయడానికి చక్కగా పనిచేస్తున్నాయి. లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఎలాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయినా సరే ప్రేమపక్షులకు చక్కటి వేదికగా ఉంటున్నాయి. వీటి ద్వారా అనేక మంది వ్యక్తులు తమ ప్రేమైకమూర్తులను కలుస్తున్నారు.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కూడా ప్రేమ పక్షులను కలపడంతో ముందుంది. అలాంటి ఓ ప్రేమకథే ఇది. #WeMetOnTwitter అనే హ్యాష్ ట్యాగ్ కొంతకాలంగా ట్రెండింగ్ లో ఉంది. ఈ ట్రెండ్‌పై హోప్ చేస్తూ, డొనిటా జోస్ తన #WeMetOnTwitter స్టోరీని షేర్ చేశారు. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన డొనిటా ప్రస్తుతం తన భర్తను ఎలా కలుసుకుంది.. ఎలా ప్రేమలో పడింది.. పెళ్లివరకు ఎలావచ్చింది ఓ స్టోరీ షేర్ చేసింది.
ఆమె జర్నలిస్ట్ కావడంతో ఓ స్టోరీ రిపోర్టింగ్ విషయంలో సహాయం కోరుతూ ప్రస్తుతం తన భర్తకు ట్విట్టర్‌లో మెసేజ్ పంపించింది. అదికూడా చాలా సింపుల్, క్యాజువల్ మెసేజ్.. స్టోరీ కవర్ చేయడంలో అతని సహాయం కోరింది. తాను న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేస్తున్నానని.. తన పేరు డొనిటా అని..టీఎస్ఆర్టీసీ మీద స్టోరీకి సహాయం కావాలని కోరింది.
దీనికి స్పందించిన అతను.. ఒకవేళ స్టోరీ విషయంలో మాట్లాడాలనుకుంటే సాయంత్రం 6 తరువాత కాల్ చేయండి.. లేదా డే లో ఎప్పుడైనా మెసేజ్ లో అందుబాటులో ఉంటా అని తన ఫోన్ నెం. షేర్ చేశాడు. అలా వారిద్దరి మధ్య పరిచయం జరిగింది. అప్పటి ఛాటింగ్ స్క్రీన్ షాట్ ను కూడా ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ తరువాత తమ ఎంగేజ్ మెంట్, పెళ్లి ఫొటోలను కూడా షేర్ చేశారు.
అతి సాధారణమైన సంభాషణతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసిన ఈ స్టోరీకి ట్విట్టర్ లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.