Asianet News TeluguAsianet News Telugu

బటర్ చికెన్, నాన్ రుచికి ఫిదా అయిన అమెరికన్.. వీడియో వైరల్

అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మొదటిసారి భారతీయ వంటకాలను రుచి చూశాడు. ఆ రుచి గురించి ఓ వీడియో షేర్ చేశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

US man tries butter chicken, naan for the first time, Video goes Viral - bsb
Author
First Published Oct 17, 2023, 2:09 PM IST | Last Updated Oct 17, 2023, 2:08 PM IST

ఇండియన్ ఫుడ్ అంటే ప్రపంచవ్యాప్తంగ క్రేజ్ పెరుగుతోంది. భారతీయ వంటకాల ప్రత్యేక సమ్మేళనం, అందులో వాడే సుగంధ ద్రవ్యాలు, అద్భుతమైన రుచులు ఎంతో మంది ఫుడ్ లవర్స్ మనసులు దోచుకుంటున్నాయి. షాహీ పనీర్, దాల్ మఖానీ, బటర్ నాన్ , జిలేబీ వంటి ఐకానిక్ వంటకాలు భారతదేశ పాక నైపుణ్యానికి పర్యాయపదాలుగా మారాయి. 

భారతీయ ఆహారానికి ఉన్న ప్రజాదరణ చూసిన.. విదేశీయులు రుచి చూడాలని ఉవ్విళ్లూరుతారు. అలా రుచి చూసిన తమ అనుభవాలను తరచుగా వివిధ సామాజిక మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోల రూపంలో పంచుకుంటారు. అలా ఓ వ్యక్తి మొదటిసారిగా భారతీయ ఆహారాన్ని ఆస్వాదించాడు. దాని గురించి తన అనుభవానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

ఆ వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. "ఈ వంటల రుచితో నా నోట్లో లాలాజలం ఊరుతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్న చికెన్.. ఎంతో స్మూత్ గా ఉన్న నాన్..గులాబ్ జామ్ ల టేస్ట్ కు ఫిదా అయిపోయా’ అంటూ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో అతని హావభావాలు, వంటకాలు రుచి చూస్తున్నప్పుడు అతని ఫీలింగ్స్.. అద్భుతంగా కనిపిస్తాయి. 

ఈ వీడియోలో ఓ అమెరికన్ వ్యక్తి తన భారతీయ వంటకాల రుచి చూసే జర్నీ ప్రారంభించినట్లు తెలిపాడు. అతను కెంటకీలోని స్థానిక భారతీయ రెస్టారెంట్ 'ఇండియా ఓవెన్' నుండి ఆ భోజనాన్ని ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్‌లో ఆనియన్ భాజియా, బటర్ చికెన్, గార్లిక్ నాన్, రైస్, గులాబ్ జామూన్ ఉన్నాయి. తన కారులో హాయిగా కూర్చొని, అతను ప్రతి వంటకాన్ని రుచి చూస్తూ ఆస్వాదించాడు. 

ప్రతీ ఐటమ్ ను రుచిచూస్తూ.. వాటికి రేటింగ్స్ కూడా ఇచ్చాడు. ఆనియన్ భాజియాతో గ్యాస్ట్రోనమిక్ అడ్వెంచర్‌ను ప్రారంభించానని అది చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. దానికి 10కి 8 రేటింగ్ ఇచ్చాడు. తర్వాత, గార్లిక్ నాన్‌ని ప్రయత్నించాడు, దీనికి 9.5 రేటింగ్‌ ఇచ్చి ప్రశంసల వర్షం కురిపించాడు. తానిప్పటివరకు రుచి చూసిన బెస్ట్ బ్రెడ్ అని తెలిపాడు. ఇక అతని జాబితాలో బటర్ చికెన్ ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. ఎంతో టేస్టీ.. ఎంతో డివైన్ అంటూ అభివర్ణించాడు.

దానికి దాదాపు 9.9 రేటింగ్ ఇచ్చాడు. నాన్‌ను బటర్ చికెన్‌లో ముంచి తినడం..అతనికి కొత్తగా, ఆశ్చర్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ రెండింటిని కలిపి తిన్న రుచి అతన్ని పూర్తిగా ఆశ్చర్యపరిచింది. ఇక గులాబ్ జామూన్‌తో భోజనాన్ని ముగించాడు. ఇప్పుడు ఈ వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios