Asianet News TeluguAsianet News Telugu

తనను తాను వివాహం చేసుకున్న యూకే మహిళ.. సరైన భాగస్వామి దశాబ్దాల ఎదురుచూపుకు తెర...

సరైన జీవితభాగస్వామి కోసం రెండు దశాబ్దాల పాటు ఎదురుచూసిన ఓ మహిళ.. చివరికి తనను తాను పెళ్లి చేసుకుంది. ఈ ఘటన యూకేలో వెలుగు చూంది. 

UK woman who married herself, Decades of waiting for the right partner - bsb
Author
First Published Oct 14, 2023, 1:32 PM IST

లండన్ : జీవిత ప్రయాణంలో తోడు అవసరమే. అయితే, ఆ తోడు కోసం నిరీక్షణ దశాబ్దాల పాటు కొనసాగితే.. దానికి అర్థమే లేదు. అలాగే అనుకుంది ఓ మహిళ. అందుకే తనను తానే వివాహమాడింది. సరైన భాగస్వామికోసం రెండు దశాబ్దాలపాటు ఎదురుచూసిన ఆమె తన 42వ యేట ఈ నిర్ణయం తీసుకుంది. గ్రాండ్ గా ఏర్పాట్లు చేసి.. అందరికీ విందు ఇచ్చి మరీ స్వవివాహాన్ని సెలబ్రేట్ చేసుకుంది. 

యునైటెడ్ కింగ్ డమ్ కి చెందిన విల్కిన్సన్ అనే మహిళ తన ఈ వివాహం గురించి మాట్లాడుతూ, తాను ప్రతీనెలా తన పెళ్లి కోసం కొంత ఆదా చేశానని.. కానీ సరైన జీవితభాగస్వామి కోసం ఎదురుచూపు ఫలించలేదని తెలిపింది. తన వివాహం కోసం అలా ఆదా చేసిన రూ10 లక్షలను ఖర్చుచేసింది. 

యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 42 ఏళ్ల సారా విల్కిన్సన్ అనే మహిళ,  సరైన జీవిత భాగస్వామి కోసం గత 20 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. తన వివాహం కోసం పొదుపు చేసింది. భాగస్వామి దొరకలేదు.. అయినా గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాలనే కోరిక తీరలేదు. 

ఇక, ఇలా కాదనుకున్న విల్కిన్సన్ ఒక వివాహ వేడుకను నిర్వహించాలనుకుంది, తన కోసం ఒక నిశ్చితార్థం ఉంగరాన్ని కొనుగోలు చేసింది. సఫోల్క్‌లోని ఫెలిక్స్‌స్టోవ్‌లోని హార్వెస్ట్ హౌస్‌లో తన స్నేహితులకు చెందిన ఓ సంస్థలో తన జీవితంలోని ఈ ప్రత్యేక రోజును జరుపుకుంది.

విల్కిన్‌సన్ క్రెడిట్ కంట్రోలర్‌గా పనిచేస్తోంది. ఆమె దీని గురించి మాట్లాడుతూ.. "ఈ వేడుక అధికారిక వివాహం కాదు, కానీ నాకు నా పెళ్లి ఈ రోజు జరిగింది. 'నా పక్కన భాగస్వామి లేకపోవచ్చు. ఆ సంతోషాన్ని నేనెందుకు కోల్పోవాలి?' అని ప్రశ్నించింది. ఇది మీదరు అర్థం చేరుకుంటారని నేను భావిస్తున్నాను. ఆ డబ్బు నా పెళ్లి కోసం దాచుకున్నాను. అందుకే ఇలా ఉపయోగించకున్నాను" అని ఆమె బీబీసీకి చెప్పింది.

బీబీసీ రేడియోతో సఫోల్క్‌తో మాట్లాడుతూ, సెప్టెంబరు 30న జరిగిన వేడుకలో 40 మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. సాయంత్రం తర్వాత మరో 40 మంది టెన్నిస్ క్లబ్‌లో జరిగిన వేడుకలో పాల్గొన్నారు. "రోజంతా ఈవేడుకకు వచ్చినవారు హాయిగా, నవ్వుతూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ తాము ఎంతో అద్భుతమైన సమయం గడిపామని చెప్పారు" అని విల్కిన్సన్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios